pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

రహస్యం

4.1
6725

పెసరపాడు గ్రామాధికారి భూషయ్య ఏడేళ్ళ కూతురు కమల తండ్రి వద్దకు వచ్చి, "నాన్నా, రహస్యం అంటే ఏమిటి?" అనడిగింది. "ఎందుకూ?" అనడిగాడతను. కమల తన స్నేహితురాలు వనజ ఇంట్లో ఆడుకుంటూంటే, ఒకావిడ వచ్చి వనజ తల్లితో, "ఈ సమాచారం నీకు తెలుసా?" అంటూ ఏదో చెప్పబోయింది. అప్పుడు వనజ తల్లి పిల్లలతో, "రహస్యాలు పిల్లలు వినకూడదు. మీరు బైటకు వెళ్ళి ఆడుకోండి’ అంది. ఆ విషయం చెప్పి, "సమాచారం, రహస్యం అంటే ఏమిటి నాన్నా?" అనడిగింది కమల మళ్ళీ. భూషయ్య ఓ క్షణం ఆలోచించి, "వాటి అర్థం తరువాత చెబుతాను కాని, ముందు నువ్వు రచ్చబండ దగ్గరకు ...

చదవండి
రచయిత గురించి

‘తిరుమలశ్రీ’ గారి అసలు పేరు పామర్తి వీర వెంకట సత్యనారాయణ. ఎమ్.ఎ. (సోషియాలజి), ఎల్.ఎల్.బి., సి.ఎ.ఎస్. భారత ప్రభుత్వపు CSIR అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కి చెందిన వీరు, జాతీయ పరిశోధనాలయాల ‘చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ గా పదవీ విరమణ చేసారు.,,వీరి మరో కలం పేరు 'విశ్వమోహిని'. తెలుగులో వీరివి అన్ని జేనర్స్ లోను, ప్రక్రియలలోను (బాల సాహిత్యంతో సహా) అసంఖ్యాక రచనలు ప్రముఖ పత్రికలన్నిటిలోనూ ప్రచురింపబడ్డాయి. సుమారు 185 నవలలు ప్రచురితమయ్యాయి. పలు కథలు, నాటికలు, నాటకాలు ఆలిండియా రేడియోలో ప్రసారితమయ్యాయి. కొన్ని నాటికలు దూరదర్శన్ లో ప్రసారం కాగా, మరికొన్ని రంగస్థలం పైన ప్రదర్శింపబడ్డాయి. పలు కథలు బహుమతులను అందుకున్నాయి. కొన్ని కథలు హిందితో పాటు ఇతర దక్షిణాది భాషలలోకి అనువదింపబడ్డాయి. ఓ మాసపత్రికలో రెండు కాలమ్స్ ని నిర్వహించారు. ప్రతిలిపి 'కథాకిరీటి', 'కథావిశారద', మరియు 'బాలకథాబంధు' (బాలసుధ-బాలసాహితీ సంస్థ, విజయనగరం) బిరుదాంకితులు. 'కలహంస పురస్కార' గ్రహీతలు. ఆంగ్లంలో సుమారు 100 కథలు, ఆర్టికిల్స్ ప్రముఖ పత్రికలలోను, జాతీయ దినపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. కొన్ని బహుమతులను అందుకున్నాయి. ఓ ప్రముఖ ఆంగ్ల జాతీయ దినపత్రికలో వీక్లీ కాలమ్ రాసారు. ఓ జెర్మన్ పబ్లిషింగ్ హౌస్ ద్వారా 20 ఇ-బుక్స్ ప్రచురితమయ్యాయి ...హిందీలో ఓ బాలల నాటిక ఆలిండియా రేడియోలో ప్రసారితమయింది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Hari Kameswari "మంజు👩✍️"
    12 మార్చి 2019
    వివరణాత్మకంగా ఉంది...సార్.... అనుభవపూర్వకంగా చెపితేనే పిల్లలకు అర్థం అవుతుంది...నా రచనలు కూడా సమీక్షించగలరు...
  • author
    29 సెప్టెంబరు 2018
    ఆ అమాయక బుర్రకేమోగాని,నా బుర్రకెక్కలా 'ఇదా రహస్యమంటే?'
  • author
    madhavi raj
    20 జూన్ 2019
    nice story 👌👌👌 simple
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Hari Kameswari "మంజు👩✍️"
    12 మార్చి 2019
    వివరణాత్మకంగా ఉంది...సార్.... అనుభవపూర్వకంగా చెపితేనే పిల్లలకు అర్థం అవుతుంది...నా రచనలు కూడా సమీక్షించగలరు...
  • author
    29 సెప్టెంబరు 2018
    ఆ అమాయక బుర్రకేమోగాని,నా బుర్రకెక్కలా 'ఇదా రహస్యమంటే?'
  • author
    madhavi raj
    20 జూన్ 2019
    nice story 👌👌👌 simple