కాండ్రేగుల శ్రీనివాసరావుగారు మూడు దశాబ్దాలుగా కథలు రాస్తూనే ఉన్నారు. ఈయన కథలు ఆసక్తిగా చదివిస్తాయి. పాఠకుడిని పక్కకు చూడనివ్వకుండా చివరి వరకు తీసుకువెళతాయి. ఊహించని ముగింపుతో కళ్ళు చెమర్చి , గుండెను తడతాయి. అన్ని దిన, వార, మాస, పత్రికలు లోనే కాకుండా కొన్ని ప్రత్యేక సంచికలలో, మరియు ఆన్లైన్ మ్యాగజైన్ లో ఈయన కథలు వస్తూనే ఉన్నాయి.20 కథలు బహుమతులు అందుకున్నాయి. పాతిక కథలు హిందీలోకి అనువదించబడి, చతీస్ఘడ్ , అండమాన్ ,ఢిల్లీ, కలకత్తా లాంటి ప్రదేశాలలో విహారం చేశాయి. కన్నడంలో రెండు కథలు అనువదించబడ్డాయి. "హృదయ స్పందన కథ" కన్నడ కథా సంకలనంలో ఈయన కథలు చోటుచేసుకోవడం విశేషం.తెలుగులో మా "ఇంటిపూదోట ",హిందీలో "సైనిక్ కీ పత్నీ"కథలసంపుటిలు వెలువడ్డాయి. విజయనగరం లో జన్మించిన శ్రీనివాసరావుకి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు శరత్చంద్ర, కుమార్తె చాందిని, అల్లుడు శివచెల్లారామ్, ఇదీ వీరి కుటుంబం. శ్రీచరణ్ మిత్ర , నన్ద త్రినాధరావు, శ్రీనివాసశ్రీ , బాల్య మిత్రులు. శ్రీచరణ్ మిత్ర గారితో కథల గురించి తరచూ చర్చిస్తుంటారు. లక్షణమైన కథకులలో విలక్షణమైన కథకుడు కాండ్రేగుల శ్రీనివాసరావు.
- బాలి. ప్రముఖ చిత్రకారులు
మరియు కథారచయిత
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్