pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నేను చేసిన తప్పేంటి?

5
54

ఇవన్నీ ఎవరికి తెలుసు?మాకు తప్ప. ఇందులో నేను చేసిన తప్పేంటి? ఇవన్నీ తెలియక తామేదో గొప్పవాళ్ళుగా ఊహించుకుంటూ ఇలాంటి బాల ఓబయ్యలు కాపీ డైలాగ్‌ను వాడుతుంటారు. వారి మనస్తత్వాన్ని ఏమనాలి? అందరూ ...

చదవండి
రచయిత గురించి
author
మద్దిరాల శ్రీనివాసులు

నేను గత 15 సంవత్సరాలుగా 2005 నుండి బాల గేయ కవిత్వం ప్రారంభించినాను. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన వివిధ అంశాలపై దాదాపు 100 గేయాలకు పైగా రచించినాను. 12 సంవత్సరాల నుండి పద్య రచన చేయుచున్నాను. మూడు సంవత్సరాలుగా కథా రచనను సాగించుచున్నాను. అలాగే కొన్ని పిల్లల నాటికను, కొన్ని వ్యాసాలను కూడా వ్రాశాను. రెండు గేయసంపుటులను, మూడు శతకాలను, ఒక పద్య గ్రంథాన్ని, ప్రచురింపజేశాను. అలా ఇప్పటికి వరకు రచించిన గేయాలు దాదాపు 100కు పైన, పద్యాలు 2000 కు పైగా, వ్యాసాలు20 వరకు , కథలు 60 వరకు ఉన్నాయి. ఇవి కాక వచన కవితలు, కథానికలు, వ్యాసాలు, ఏకపాత్ర, లాంటి వివిధ రచనా ప్రక్రియలను చేయడం జరిగినది. పద్యరచనా విధానమును ఒక పుస్తకముగా సులభ శైలిలో రచించడమైనది. రేడియోలో కథలు, కథానికలు, పద్య రచను దాదాపు 15కు పైగా ప్రసారం కాబడ్డాయి. దూరదర్శన్‌ ద్వారా కూడా అనేక సమస్యాపూరణు ప్రసారం కాబడినాయి. వాట్సాప్‌ ద్వారా 5 మంది ఉపాధ్యాయులకు పద్యరచన నేర్పించి కవులుగా పరిచయం చేశాను. ఇద్దరు శతకాలను కూడా ప్రచురించారు. ఇంకనూ..... బాలల కోసమై నేను రచించిన గేయాలను ‘‘బాలగేయాలు’’ పేరిట రెండు సంపుటములుగా 2005వ సంవత్సరములో ముద్రించడమైనది. మొదటి సంపుటమును నా మాతృమూర్తి శ్రీమతి మద్దిరాల రామలక్షమ్మ కు అంకితము చేయడమైనది. మొదటి శతకము ‘‘సుబ్బరాయ శతకము’’ అను ఆటవెది పద్యాలతో నా నీతిబాటకు ఆదర్శ ప్రాయుడైన నా తండ్రి”మద్దిరాల వెంకట సుబ్బరాయుడు’కు అంకితం చేసినాను. 2006 వ సంవత్సరం నుండి నా’లుగు సార్లు మా ఇంటి ఇలవేలుపు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామిపై భక్తితో, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తురాలు గోదాదేవి గార్ల పేరున ‘ శ్రీ వేంకటేశ్వర దండకము, శ్రీ గోదాదేవి దండకము’ ను రచించి, నా స్వంత ఖర్చుతో ముద్రించి పులువురు భక్తులకు ఉచిత పంపిణీ చేసినాను. రెండవ బాలల గేయ సంపుటిని నా శ్రీమతి అనువాలశెట్టి వెంకట లక్ష్మీసులోచనకు అంకితం ఇచ్చినాను. తదుపరి ఆగష్టు 2007 న నా విద్యార్థుల కోసమై పొడుపు కథలను పద్యాలుగా రచించిన ‘‘బాలరాజ శతకము’’ ను నా అన్నవదినలు మద్దిరాల వెంకటేశ్వర్లు, సుశీల లకు అంకితం ఇచ్చినాను. 2010వ సంవత్సరములో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు నాకు విద్యలు నేర్పిన గురువులకు అంకితంగా వివిధ ఛందస్సులో రచించిన పద్యాల తోరణం, పద్య సమస్యాపూరణ ‘‘సరసానందహరి’’ అవిభక్త ఆంధ్రరాష్ట్రంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము వారి ఆర్థిక సహకారంతో ముద్రింపజేసినాను. 2011వ సంవత్సరంలో నాకు పద్యము నేర్పిన గురువు ‘శ్రీమంత్రి సీతారామయ్య’’ దంపతులకు అంకితంగా కంద పద్యాలతో రచించిన ‘రామశతకము’ అనే నీతి పద్య శతకంను ముద్రింపజేశాను. 2012వ సంవత్సరం నుండి 8 సంవత్సరాలుగా ‘బాలవికాసం’ పేరుతో ఒక పాఠశాల త్రైమాస పత్రికను ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా నుండి 30 సంచికలను ప్రచురింపజేశాను. కృష్ణా జిల్లా తెన్నేరు లోని శ్రీ దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌ అధినేత శ్రీ దేవినేని మధుసూదనరావు గారు నా విద్యార్థులకు నేను చేయిచున్న సాహితీ సేవను, బోధనా పద్ధతులను గుర్తించి, పరిశీలించి నా విద్యార్థుల పుస్తక సమీక్షలను, వ్యాసాలను, పద్యాలను, చిత్రలేఖనముతో మా పాఠశాల పేరుననే ‘‘కంకణాపల్లి విద్యార్థుల సాహితీ ప్రతిభ’’ పేరుతో ఒక 60 పేజీల పుస్తకమును 2000 కాపీలుగా ఏప్రిల్‌ 2015 న ముద్రించి విద్యాసంస్థలకు, అధికారులకు, ప్రముఖ సాహితీ వేత్తలకు , ఉపాధ్యాయులకు పంచిపెట్టినారు. పిల్లలకు నేర్పుతున్న ఈ నా బోధనా సాహిత్య విధానమును ‘‘ తరగతి రాజ్యాంగము’’ పేరున ఒక చిన్న పుస్తకమును కూడా నా స్వంత ఖర్చులతో సెప్టెంబర్‌ 2017న ..అచ్చు వేయించాను. ఇదే సంవత్సరములో నా బోధన , సాహిత్య కృషిని గమనించి ప్రకాశం జిల్లాలోని ఒక సంస్థ ‘కళామిత్రమండలి, ఒంగోలు’’ వారి నుండి 2017వ సంవత్సరానికి ‘‘గిడుగు సాహితీ పురస్కారాన్ని, అందుకున్నాను. నా విద్యార్థులచే కూడా కథారచనలతో పాటు వివిధ రచనా ప్రక్రియలను నేర్పించినాను. వారి చిరు కథలను వివిధ పత్రికలకు పంపిస్తూ ఉండేవాడిని. అవి ప్రచురితమయ్యేవి. అలా మా పాఠశాలోని 5,6,7 తరగతుల విద్యార్థులచే అలా ప్రచురింప బడిన 22 కథలను ‘‘విరిసిన మొగ్గలు ’’ పేరిట 2018వ సంవత్సరములో ‘‘అనంతపురం, గాయత్రి ప్రచురణలు ’’ అధినేత శ్రీ జూటూరు తుసీదాస్‌ గారి కొంత ఆర్థిక సహకారంతో పుస్తకంగా ప్రచురించాను. ఈ పుస్తకమునకు 2019నకు గాను తెలంగాణ లోని డా॥చింతోజు బ్రహ్మయ్య బాలామణి మెమోరియల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ‘బాలప్రతిభా పురస్కారము’ కూడా అందుకోవడం జరిగినది. 2019లో విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ వారు నేను రచించగా పలు పత్రికలలో ప్రచురింపబడిన కథలను కొన్నిటిని ‘నగరదిష్టి’’ పేరున ఒక సంకలనమును ముద్రించడం జరిగింది. అది నా ముద్దుల కుమారులు వెంకట రామ్‌ప్రకాష్‌, వెంకట తరుణ్‌ ప్రదీప్‌లకు అంకితము ఇవ్వడం జరిగినది. 40కి పైన కథలను వివిధ పత్రికలలో ప్రచురింపబడినాయి. కొన్నిటికి అవార్డులు కూడా వచ్చాయి. పలు సంస్థల నుండి ప్రశంసలు, సన్మానాలు కూడా అందుకున్నాను. 1.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 2.మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 3.జిల్లా ఉగాది పురస్కారము, కలెక్టర్, ఒంగోలు, 4.మహాత్మా గాంధీ పద్యరచనా పురస్కారము,విజయవాడ రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి, 5. ప్రభుత్వ పుస్తక రచనా సభ్యునిగా, 6.ఎయిర్ ఇండియా బోల్ట్ అవార్డు,ముంబయ్, 7.తెలుగు వెలుగు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 8.ఆల్ ది బెస్ట్ అకాడెమీ, హైదరాబాదు, వారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 9.గురజాడ పురస్కారము,10. ప్రకాశం జిల్లా రచయితల సంఘం,11. ప్రకాశం జిల్లా శ్రీ కృష్ణదేవరాయ సాహీతీ సంస్థ పురస్కారము, 12.ఆనందమయి సాహితీ సంస్థ పురస్కారము, 13.జిల్లా తెలుగు వికాస పురస్కారము, రామ్ కీ ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము, 14.తెలుగు ప్రపంచ సభల పురస్కారము, 15.ఒంగోలు శాంతివనం ఫౌండేషన్ వారి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారము,16. అద్దంకి జానపద కళాపీఠము వారి పురస్కారము, 17.న్యూఢిల్లీ వారి జాతీయ స్థాయి గ్లోబల్ రోల్ మోడల్ టీచర్ అవార్డ్, 18.చిలకలూరి పేట రావూరి భరధ్వాజ పీఠము వారి పురస్కారము, 19.ప్రజ-పద్యం , గుంటూరు, 20.గోలి వెంకట్రామయ్య రాష్ట్ర స్థాయి ఉత్తమ కథా పురస్కారము, 21.రాష్ట్ర స్థాయి రంజని, విశ్వనాథ పద్య పురస్కారము, హైదరాబాద్, 22.రాష్ట్ర తెలుగు బ్రహ్మోత్సవాల పురస్కారము, కలెక్టర్ , ఒంగోలు, 23.అమరావతి బాలోత్సవ్, విజయవాడ, 24.సృజన సాహితీ సంస్థ, అద్దంకి, 25. కళామిత్రమండలి, ఒంగోలు వారి గిడుగు సాహితీ పురస్కారము, 26. నవ్యకవితా కళానిధి, శ్రీ బి.వి.వి.శాస్త్రి స్మారక పురస్కారము, ఒంగోలు నేను చేస్తున్న వృత్తి సంబంధమైన కృషిని, సాహితీ కృషిని పరిశీలిస్తున్న మిత్రులు, ఒంగోలు వాసి కవి, ఉపాధ్యాయుడు శ్రీ భువనగిరి పురుషోత్తంగారు, కీర్తి శేషులైన వారి అన్నగారి జ్ఞాపకార్థం ప్రథమంగా ప్రారంభించిన పురస్కారమును, తేది:20`10`2019న రాష్ట్ర స్థాయిలో శ్రీ బి.వి.వి. శాస్త్రి స్మారక సాహితీ పురస్కారముతో పాటు, ‘‘నవ్యకవితా కళానిధి’’ బిరుద సత్కారమును నాకు అందించడం మహదానందం. నాకు సంబంధించిన ఈ విషయాలన్నిటినీ www.maddiralasreenivasulu.blogspot.com అను బ్లాగు సంకలినిలో ప్రదర్శిస్తున్నాను. అలాగే నా విద్యార్థుల రచనల పత్రిక ‘బాలవికాసం’ పత్రికలో ప్రచురింపబడిన పిల్లల కథలను www.baalavikaasam.blogspot.com అనే బ్లాగులో ప్రదర్శిస్తున్నాను. ఇంకా.... విద్యార్థులకు నేను నేర్పిస్తున్న వివిధ విషయాలను వీడియోల రూపములో MADDIRALA SREENIVASULU అనే పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రవేశపెడుతున్నాను. ఇప్పటి వరకూ 140 వీడియోలను అప్‌లోడ్‌ చేశాను. ఆ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 600 దాటింది. ఈ విధమైన క్రమములో నేను ఇప్పటి వరకు చేసిన రచనా ప్రక్రియలు, 1. పద్యము, 2.గేయము, 3.పద్యకథ,4. గేయకథ, 5.వ్యాసము, 6.పిల్లల నాటిక, 7.వచన కవిత్వము, 8.నానీలు, 9.పేరడి పాటలు, 10.ఏకపాత్ర, 11.చిరు నవల, ( త్రిపురాంతక క్షేత్ర మహిమ అనే పిల్లల సంభాషణలతో కూడిన చారిత్రక నవల-2020) ,12. మణిపూసలు,13. ఇంగ్లీష్ రైమ్స్, 14.జానపదగేయాలు, 15.ప్రతిజ్ఞలు, 16.దండకములు, 17.కథలు, 18. కథానికలు, 19.సమస్యాపూరణము 20.అభ్యుదయ గేయము

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Maddirala Venkata Tarun Pradeep
    27 నవంబరు 2020
    It's really a fantastic story. Fabulous and more realistical manner.
  • author
    bhupathi subramanyam
    30 నవంబరు 2020
    మీ స్వీయ అనుభవం లాగా వుంది.
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Maddirala Venkata Tarun Pradeep
    27 నవంబరు 2020
    It's really a fantastic story. Fabulous and more realistical manner.
  • author
    bhupathi subramanyam
    30 నవంబరు 2020
    మీ స్వీయ అనుభవం లాగా వుంది.