pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆడ జన్మకి గర్వ కారణం

4.1
795

ఆడ జన్మకి గర్వ కారణం….అమ్మే. అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది అమృత ధార…. మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే ఈ అమ్మ జన్మ ఇలలో ఒక అద్భుత వరం… ప్రేమ పంచి పెంచి, లాలించి, బుజ్జగించి అభిమానాన్ని గోరు ...

చదవండి
రచయిత గురించి
author
గోగులపాటి కృష్ణమోహన్

నా కవితలపై "అరుణ ధార" అటు జర్నలిస్ట్ గా ,ఇటు సమూహాల్లో ఉత్సాహం గా పాల్గొంటూ కుటుంబానికి దూరమైన భావన రాకుండా వారి ధర్మ పత్ని ని, ఇద్దరు పిల్లల్ని పద్య మకుటం గా అమర్చి రెండు శతకాలకు పైగా భావరహిత పద్యాలను రాయడంతో పాటు.... ఎన్నో భావయుక్తమైన వచన కవితలు రాసిన కవిమిత్రులు, సహస్రకవి శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారి కలం నుండి జాలువారిన కవనాలలోని అంతరంగాలను ఓ సారి తొంగిచూస్తే.... కల్తీ లేని మనిషి కలత చెంది రాసిన కల్తీ కవిత ఎంత అద్భుతమో వివిధ గ్రూపుల్లో తిరగడం సాక్ష్యం .అలాగే వారి జర్నలిస్ట్ కవిత ఎన్నెన్నో సమూహాల్లో ప్రయాణం చేసి తిరిగి వారికే వారి పేరు లేకుండా చేరడం చూసి కవిత గొప్పగా ఉంది అన్నమాట అని ప్రతికూలంగా ఆలోచించ గలిగిన స్థిత ప్రజ్ఞ త వారి సొంతం అవయవదానం గురించీ చక్కగా విశదీకరించిన కృష్ణ మోహన్ గారు అవయవాల దొంగతనం చేసే వైద్యుల పై మరో కవితలో సమరశంఖం పూరిస్తారు .. నగరం లోని ట్రాఫిక్ ని ,అడ్డా కూలీ ల పాట్ల ని అలవోకగా తన కవితల్లో జోప్పిన్చారు వ్యభిచారిణి అన్న కవితలో కూడా అప్రయత్నంగా నొ ,అనుకోకుండానో ,పిల్లల కోసం తప్పని పరిస్తితుల్లో ఆ కూపం లోకి దిగినా వారు అనుబవిన్చే కష్టాల వివరణ మనకి వారి పట్ల జాలి కలిగేలా సాగిన కవితా ధోరణీ కృష్ణ మోహన్ గారిని బాధిత పక్ష పాతి గా మన ముందు ఉంచుతుంది వీరి మారిన విలువలు కవిత నేడు సమాజ పరిస్తితి కి మారిన విలువల కి అద్దం పడితే ,పురాణాల పట్ల వీరి కున్న పట్టు యాగం -యోగం లో స్ఫుటం గా తెలుస్తోంది . ఆలుమగలు ఎలా ఉండాలో కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయికి తల్లి చెప్పే బుద్ధుల్లా నేటి యువతకి ఎంతో అవసరమైన కవిత . బాల్యం కవితలో మా వంటి వారికీ తెలియని కొన్ని ఆటలు తెలియజేస్తూ ,చిన్ననాటి ముచ్చట్లు గుర్తుతెస్తుంది .జై జవాన్ -జై కిసాన్ కవితలో రైతుని ఆత్మ త్యాగి గా ,సైనికుడిని ప్రాణ త్యాగి గా పోలుస్తూ ఇద్దరికీ సమాన గౌరవాన్ని కల్పించారు . ఉగాది పై రాసిన కవితలో ఉగాదులు మారుతున్నపుడు ఆకులు రాలుతున్నాయి ,ప్రతిసారీ ఆదాయ ,వ్యయాలు చూడ్డం తప్ప అనడం లో కొంత పరిస్తుతుల పట్ల నిరాశ పేదల బ్రతుకులు మార్పు లేదు అన్న చిన్న విమర్శ తొంగి చూస్తాయి .ఇలా వచనం మాత్రమే కాక ,సీస ,ఆ .వె ,కందము వంటి పద్యాలు కూడా అద్భుత భావం తో వెలువరించారు. ఇంకా వీరి కలంనుండి సమాజానికి ఉపయోగపడే కవనాలు మరెన్నో రావాలని ఆశిస్తున్నాను.... ఇట్లు చామర్తి అరుణ ఫణిందర్ MA, B. Ed., హన్మకొండ.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Navya Gogulapati
    24 మే 2017
    Chala bagundi dady..........super asala....👍👍👍😉😉😉👍👍👍
  • author
    aruna
    23 మే 2017
    Gunapaalu dinchinaa ...baagundi saar vastavikata
  • author
    Anu Ramesh
    23 మే 2017
    Its very nice uncle... Rams....
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Navya Gogulapati
    24 మే 2017
    Chala bagundi dady..........super asala....👍👍👍😉😉😉👍👍👍
  • author
    aruna
    23 మే 2017
    Gunapaalu dinchinaa ...baagundi saar vastavikata
  • author
    Anu Ramesh
    23 మే 2017
    Its very nice uncle... Rams....