pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నవ మాసాలు మోసి నాకు జన్మనిచ్చావు వెండిగిన్నెలో పప్పుబువ్వను ప్రేమగా తినిపించావు అలారం కొట్టకముందే కాఫీ కప్పుతో నిద్ర లేపే నీవు.. పరీక్షలకు చదువుతున్నప్పుడు పెరుగన్నం ముద్దతో కడుపునింపుతావు పరీక్షల్లో ఫస్ట్‌ వస్తే పాయసపు పాత్రతో గుమ్మంలోనే ఎదురౌతావు నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టి పెంచావు అమ్మా! నీ కోసం నేను ఏమివ్వగలను? మళ్లీ నీ కడుపున పుట్టి నీ ప్రేమను పొందడం తప్ప.. - పి. శ్రీనాథ్‌ ...