పుట్టింది పెరిగింది ఆంధ్రా. 2020 జనవరి వరకు పాఠకురాలిని మాత్రమే! జనవరి నుంచీ రచనావ్యాసంగాన్ని ప్రారంభించాను. ప్రతిలిపి నాకంటూ ఓ గుర్తింపును అందించింది. విలువైన పాఠక అభిమానులను ఇచ్చింది. తపస్వి మనోహరం, సహరి వీక్లీ మేగజైన్ లలో నా కథలు ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యాయి. ప్రచురితమైనవి అన్నీ హాస్య కధలే కావడం విశేషం.
ఓ రాష్ట్ర స్థాయి కథల పోటీలో పాల్గొని రెండవ బహుమతి పొందాను. ఇంతకు మించి పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేవు. కారణం నాలోని రచయిత్రి వయసు ఒకటిన్నర సంవత్సరం కావడమే!
నా బలహీనత, బలం రెండూ పాఠకులే! నా ముందున్న ధ్యేయం పాఠకులను నిలుపుకోవడమే! నా గురువులేమో పత్రికలలో నా కథలు రావాలి అనే టార్గెట్ ఇచ్చారు. ప్రయత్నించాలి.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్