నా పద్యాలను, కవితలను ఆదరిస్తున్న పాఠక మహాశయులకు వందనం. మీ అమూల్యమైన సమీక్ష కూడా అందించండి.
నన్ను అనుసరిస్తున్న సహ రచయితలు, కవులు, ఇతర మిత్రబృందానికి ధన్యవాదాలు. మీ సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
తెలుగు కవితా వైభవం హైదరాబాద్ వారిచే సహస్ర కవిరత్న, సహస్రవాణి శత స్వీయ కవితాకోకిల, సహస్రవాణి శత పద్య కంఠీరవ బిరుదులను, గురజాడ ఫౌండేషన్ అమెరికా వారి జాతీయ విశిష్ట కవితా పురస్కారమును, తెలుగులెస్స వాట్సాప్ బృందము చే పద్యమంజరి బిరుదమును, ఇంకను అనేక పురస్కారములను, బహుమతులను, పొందియుంటిని. అనేక దిన, వార, మాస , ప్రత్యేక, అంతర్జాల పత్రికలు, విశేష సంచికలలో నా రచనలు ప్రచురితమైనవి.
ఉపాధ్యాయురాలిగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అవార్డీ టీచర్స్ అసోసియేషన్ వారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారమును పొందియుంటిని. ఖర్చులేని, తక్కువ ఖర్చు గల బోధనోపకరణముల తయారీలో పాఠశాల సముదాయ స్థాయి, మండల, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు పొందియుంటిని. సాలూరు సాహితీ మిత్ర బృందం వారిచే వేగావతీ భారతి బిరుదు పొందియుంటిని.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్