<p>చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకరు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.</p><p>మైదానం, దైవమిచ్చిన భార్య, ప్రేమ లేఖలు, స్త్రీ, మ్యూజింగ్స్ వంటివి చలం రచనలలో సుప్రసిద్ధమైనవి. చలం తన భావాలను వ్యక్త పరచటానికి అనేక రచనా ప్రక్రియలు వాడారు. కథలు, నవలలు అందులో ముఖ్యమైనవి. నాటకాలు కూడ ఉన్నాయి కాని, అందులో వ్యంగ నాటికలు ఎక్కువ. ఈ జాబితాలో ఉదహరించినవి చలం వ్రాసిన అసంఖ్యాకమైన రచనలలోనివి కొన్ని మాత్రమే. అనేకమైన కథలు ఏవేవో పత్రికలలో పడినవి దొరకనివి చాలా ఉన్నవట. అలా దొరకని కథలను వెదికి పుస్తక రూపంలోకి తేవటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.</p><p> </p><p>సమాచారం: వికీపీడియా</p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్