<p>గుంటూరు వాస్తవ్యులైన శ్రీ రావి రంగారావు కవిత్వాన్ని ప్రజలచెంతకు తీసుకెళ్ళటం ఒక ఉద్యమంగా భావించి కవిత్వం రాస్తున్నారు. పిల్లలతో, యువకులతో, కొత్తవారితో కవిత్వం రాయిస్తున్నారు. వేమనను స్ఫూర్తిగా తీసుకొని మినీకవిత ఒక కొత్త ప్రక్రియగా నిలదొక్కుకొనటానికి విశేషకృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ మినీకవితల సంకలనాలు ప్రచురిస్తున్నారు. మినీ కవిత పితామహుడుగా ప్రఖ్యాతి గాంచారు. పాతిక సంవత్సరాలకు పైగా వచ్చిన మంచి మినీకవితల్ని సేకరించి దాదాపు 500 మంది కవుల 1227 మినీకవితలు ప్రచురించారు. పిల్లల్లో రచనా నైపుణ్యాలు - అనే అంశం గురించి పి. హెచ్.డి.చేశారు. రావి పొడుపు కథలు అనే పేరుతో పిల్లల కోసం మంచి పొడుపు కథలు సొంతంగా రచించారు. మచిలీపట్నం సాహితీమిత్రులు - అనే సంస్థ స్థాపించి గత 28 సంవత్సరాలుగా సాహిత్య కార్యక్రమాలు క్రమంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.</p><br/><p>ప్రతిలిపిలో ప్రచురితమవుతున్న రావి రంగారావు గారి రచనలన్నీ ముందుస్తు అనుమతితో ఆయన బ్లాగు నుండి తీసుకున్నవే. కాపీరైటు హక్కులన్నీ కూడా రచయితకే చెందుతాయి.</p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్