కూకట్ల తిరుపతి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం మద్దికుంట గ్రామంలో 1975లో జన్మించారు. పేద వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్నతనంలో బాల కార్మికుడిగా పనిచేశారు. అయినప్పటికీ పట్టుదలతో తన చదువును కొనసాగించారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసి, ఆ తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ (తెలుగు) చేశారు. 1996 నుంచి కవితలు రాయడం మొదలుపెట్టారు. 2005లో మొదటి పుస్తకం మేలుకొలుపు (వచన కవిత్వం), 2006లో చదువులమ్మ శతకం, 2007లో పల్లె నానీలు వెలువడ్డాయి. ఇటీవలే ఆరుద్ర పురుగు, ఎర్రగాలు కవిత్వం సంపుటాలుగా వెలువడ్డాయి. 2009లో కాళోజీ స్మారక రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం, 2010లో తెలంగాణ సాహిత్య పురస్కారం, గ్రామీణ కళాజ్యోతి పురస్కారం, 2013లో గుర్రం జాషువ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం వీణవంకం మండలం గంగారం హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్