pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ప్రతిలిపి తో నా ప్రయాణం.

5
80

నన్ను అభిమానించిన నా పాఠకులందరికీ నమస్కారాలు. ప్రతిలిపి తో  నా ప్రయాణం చాలా బాగుంది. ప్రతిరోజు నా రచనలకు వచ్చే సమీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒక సమీక్ష వచ్చినా చాలా సంతోషిస్తాను. రేటింగులు ...

చదవండి
రచయిత గురించి

నా పేరు యస్ యస్ సుజాతమ్మ , చిత్తూరు జిల్లా వాసిని. నా తల్లి తండ్రులు చిత్తూరు సుబ్బారెడ్డి, సరోజమ్మలు ZPHS కాళహస్తి లో ఉపాధ్యాయులు గా పని చేసారు. నేను ZPHS పత్తిపుత్తూరు, వడమాల పేట మండలం లో ఆంగ్ల ఉపాధ్యాయిని గా పని చేస్తున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో కొనసాగింది. నా రచనలు ఎక్కువగా ఈనాడు వసుంధర, ఈతరం, విపుల ల్లో 2003-2010 ప్రాంతం లో ప్రచురితమైనాయి. ఆ తరువాత నిలిపివేసిన నా ప్రవృత్తిని కరోనా లాక్ డౌన్ లో మళ్ళీ మొదలు పెట్టాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    శ్రీచరణ కమలం సూపర్ ఫ్యాన్
    24 ఆగస్టు 2023
    అవును‌ .. మీవంటి ఉత్తమ రచయిత్రి తొ పరిచయబాగ్యం ప్రతిలిపి వల్లనె కలిగింది💐🙏 గంగీగోవు పాలు గంటెడైనను చాలన్నట్టు మీ జీవితానుభావసారాన్ని నింపి మాకిచ్చే అమూల్యసందేశాలు మీ రచనలు. మీ వంటి పెద్దలు ఇప్పటి విపరీత పోకడలు చూస్తు ఏవగింపుతో దూరంగా ఉండిపోతున్నారు.. అలాకాకుండా మీలోని ఉపాధ్యాయిని సహనంతో చక్కదిద్దె ప్రయత్నంగా రచనలు చేయడం చాలా ఆనందించవలసినదే కాక బహుధా ప్రశంసనీయం..💐🙏🙏🙏 అయితె కంచు మోగినట్టు కనకము మోగనట్టె మంచిని పంచేలా పెంచేలా ఉన్నవాటికి దూరంగా ఉండటం కూడా మనిషి గుణం .. చెడుకున్న అకర్షణ అధికమేఐనా అది తాత్కాలికం.. అదే ఇక్కడ కూడా చూస్తున్నాం. శాశ్వతమైన మేలు ఎప్పటికైనా అర్హులకు అందుతుంది .. గంగ చెంతనే ఉన్నా అందరూ వారివారి పాత్రలకు తగ్గట్టుగా‌ మాత్రమే పొందగలరు. మీవంటి రచయితలు ప్రతిలిపిలో మెరవని మాణిక్యాలు.. మీ రచనలు చదవగలగడం, మీ జీవితపాఠాల సారాన్ని సులభంగా మేమూ అందుకోవటం జరిగేలా అవకాశమిచ్చిన‌ లిపికి ధన్యవాదాలు💐🙏 మీకు అనేక నమస్సులు👌👌👌💐🙏🙏🙏
  • author
    Love and Learn Telugu
    17 సెప్టెంబరు 2023
    నమస్తే టీచెర్ మేమ్. మీ రచన ద్వారా మిమ్మల్ని కలుసుకొనే అవకాశం కలిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. మన పరిచయం నా యొక్క వేరొక ప్రొఫైల్ ద్వారా జరిగింది. అప్పుడు నేను కొన్ని కారణాల రీత్యా వృత్తికి విరామంగా ఉండటం వల్ల మీ రచనలు దాదాపు అన్నీ చదివాను. తర్వాత వృత్తిలో పనినందున మీరు పోటీకి వ్రాసిన రచనల దగ్గర నుండి చదవలేక పోయాను. మీ రచనల్లో తరచుగా స్త్రీవాదం కనపడుతుంది. అలాగని చెప్పి అది వితండవాదం, అహేతుకవాదంగా కనపడదు. అది నాకు బాగా నచ్చుతుంది. అలాగే మీ ఉపాధ్యాయ వృత్తిని ఆధారంగా చేసుకొని, దాని ద్వారా వచ్చిన అనుభవంతో వచ్చిన రచనలను కూడా ఆకట్టుకొనే విధంగా వ్రాసారు. కొన్నికొన్ని చోట్ల ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఏవిధంగా విద్యార్థులను అనైతికతకు వాడుకొంటారు, తల్లిదండ్రులు ఏవిధంగా తమ పిల్లలను నిర్లక్ష్యానికి వదిలి వేస్తారు, తెలిసితెలియని వయసులో పిల్లలు ఏ విధంగా చెడుకు అలవాటు పడుతారో ఇత్యాదివన్నీ ఎక్సె రే స్కానింగ్ రోగ నిర్ధారణ జరిగినట్లు మీ రచనల్లో తేటతెల్లం చేసారు. ఇవన్నీ చదువుతుంటే మీ దృష్టి మీ వంతు సమాజానికి మీ రచనల ద్వారా ఒక అభిలషణీయమైన మార్పు ఆశించినట్లు కనపడింది. ఆ విధంగా మీరు ఒక సంఘ సంస్కర్తే. అలాగే కుటుంబాల్లో వ్యక్తుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో కూడా అనేక రచనల్లో తగిన సన్నివేశాల్లో చెప్పుకొచ్చారు. అలా వ్యక్తుల ప్రవర్తనకు ఆధారమైన కారణాలను కూడా తెలిపే వారు. వీటిని సక్రమంగా చదివి అర్థం చేసుకొన్న పాఠకులకు బోలెడంత మనో విజ్ఞానం, వికాసం తప్పక దొరుకుతుంది. ప్రస్తుతం నా వృత్తి, నా వ్యాపకం తో మీ రచనలను చదవలేక పోతున్నాను. అన్యధా భావించకండి. నిస్సందేహంగా మీరు సమాజాభివృద్ధికి కావలసిన రచనలు చేసే రైటర్ల కోవలోనికి వస్తారు. ఇచ్చానమ్మ వాయనం, పుచ్చుకున్నానమ్మ వాయనం వెల్లువలో పోతున్న పాఠకాదరణ మీ వంటి ఉద్ధండుల రచనల వైపు దృష్టి సారించక పోవడం లో తప్పేముందనిపిస్తుంది. అలాగే ప్రతిలిపి పెట్టే పోటీలు, అందులో గెలుపొందిన రచనలు తీరు చూస్తుంటే మనసు సరిపెట్టుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే మీ అభిప్రాయంతో ఈ విషయంలో ఏకీభవిస్తున్నాను. భవిష్యత్తులో ప్రతిలిపి వారు ఇంకా మెరుగైన రీతిలో వీటిని నిర్వహించి, బహూకరణలు చేస్తారని ఆశిద్దాం. అమ్మో ఇప్పటికే చాలా ఎక్కువ వ్రాసి మీకు ఇబ్బంది కలిగించానేమో. అయినా నా అభిప్రాయమంతా ముఖప్రీతి కోసం కాకుండా, అంతరాత్మ ప్రబోధంగా వచ్చినవి. మీరు మీ రచనా వ్యాసాంగాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తూ అనేక మైలు రాళ్లు చేరుకుంటూ విజయ పరంపర చూడాలని కోరుకుంటూ శెలవు తీసుకొంటున్నా.
  • author
    Neeraja
    24 ఆగస్టు 2023
    మీ రచనలు చివరిది తప్పితే అన్ని చదివాను. అన్ని సమాజహితమైనవిగా ఉన్నాయి. లిపిలో కొత్తవారు నిలదొక్కుకోవడం కష్టంగా ఉంది. కరోనా టైమ్లో రాసిన వారు నిలదొక్కుకున్నారు.అప్పుడు పాఠకులు ఎక్కువ మంది. ప్రేమకథలు చదివేవారు టీనేజ్ వారు. మొదటి నుంచి చివరి వరకు హీరో హీరోయిన్సే ఉండాలనుకొంటున్నారు. సమాజం అంటే ఎవరు చదువుతారు. రామాయణం భారతాలను ఇప్పటికి చదువుతున్నారు.వాటివలన ఆకాలంలో ఎలా ఉన్నారు.ఎలా ఉంటే దెబ్బ తిన్నారని రాసారు. అవి ఇప్పటికి, ఎప్పటికి మనకు ఉపయోగపడుతున్నాయి. రచనల్లో సమాజం హితం ఉండాలి. నాకు అనిపించిందేమిటంటే, ప్రేమకథలోనే సందేశం ఇవ్వండి. నేను అడిగిన వెంటనే మీరు ఇచ్చిన సలహాలు.పోత్సాహం బాగుంది. మీ పాఠకురాలిని.అభిమానిని కూడా...