నా సమీక్ష చదివి నా ప్రొఫైల్ చూస్తున్న వారికి నమస్కారం🙏
ఏదో ప్రతిలిపి id క్రింద రచయిత అనే టాగ్ ఇచ్చింది కానీ నేను నన్ను రచయిత గా గుర్తించుకోలేదు ఎప్పుడూ.
నా రాతలన్నీ నా భావ వ్యక్తీకరణలే.
అలానే మీ రచన కు కూడా నా కామెంట్ ,నా మనో వ్యక్తీకరణ మాత్రమే..ఆ క్షణంలో నా మనసు స్పందన.
నేను సాహితీ విమర్శకురాలిని కాదు, విశ్లేషకురాలిని కాదూ, రచనా సారాన్ని గ్రహించే ఉత్తమ పాఠకురాలిని కాదు.
"నా మాటలు ను అక్షరాల లోకి తర్జుమా చేసే ఓ భావాన్ని అంతే."
ఆ భావాలకు ఏ సైద్ధాంతిక పరమైన విలువ , మేధో పరమైన వివరణ, విమర్శనా దృష్టి కూడా వుండక పోవచ్చు..అది మీలోని రచనా నైపుణ్యాన్ని పెంచే,ఆకు రాయి ఏ మాత్రం కాదు.😊
ఆ క్షణంలో మీ రచన దగ్గర నిలిచిన నా మనస్సు మాత్రమే వుంటుంది..😊
నేను జాలువారే మనసునే..🩷
నాలోకి నీ భావాలు
నీతో నా భావనలు
వెరసి మన ఇద్దరిదీ
ఓ కొత్త బంగారులోకం.
ఈ లోకంలో
నిరంతరం కురిసే స్వాతి జల్లులు
నిరంతరం ప్రసరించే వెలుగు రేఖలు
నిరంతరం పరిమళించే సుమగంధాలు
అక్షరాలే ఊపిరి గా సాగే
నాలోకి నా ప్రయాణంలో
కనుగొనేది నిన్నే...😊😊
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్