నేడు ప్రపంచవ్యాప్తముగా కాలుష్యము అనేది మానవాళికి ఒక పెద్ద సమస్యగా తయారు అయింది మనము పీల్చే గాలి నాణ్యత తగ్గిపోతుంది ఫలితముగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ఈ కాలుష్యాలలో అన్నింటికన్నా ప్రమాదమైనది గాలి కాలుష్యము విషవాయువులను పీల్చటం వల్ల ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధులు క్యాన్సర్, గుండె జబ్బులు విపరీతముగా పెరిగిపోతున్నాయి. వివిధ రకాల సర్వేలు శాస్త్రీయ అధ్యయనాలు పీల్చే గాలి యొక్క నాణ్యత తగ్గిపోవటం వల్ల మూత్ర పిండాల సమస్యలు కూడా తలెత్తు తున్నాయని తెలియజేస్తున్నాయి. మన శరీరములో మూత్రపిండాలు ...

