pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నిర్ణయం

5
22

'పాలపిట్ట' సాహిత్య మాస పత్రిక ఉగాది ప్రత్యేక కథల సంచికలో ప్రచురితమైన నా కథ 'నిర్ణయం' ప్రతిలిపి మిత్రుల కోసం.                   *********** నిర్ణయం (కథ) వైబోయిన సత్యనారాయణ సాయంత్రం ఆరు గంటలు. ...

చదవండి
రచయిత గురించి
author
వైబోయిన సత్యనారాయణ

పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో 1960 వ సంవత్సరం జూలై 17న. కానీ పెరిగిందీ ఎదిగిందీ ఇంటర్ వరకూ చదివిందీ (1966-78) నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో. తరువాత సంవత్సరం (1978-79) పాటు నిడమనూరు శ్రీ విద్యానికేతన్ లో ప్రయివేటు స్కూల్ టీచరుగా ఉద్యోగం. తరువాత ఖమ్మం ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ గవర్నమెంట్ కాలేజీలో బీయస్సీ ఎలక్ట్రానిక్స్ (1979-82) చదువుకున్నాను. డిగ్రీ చదువుతూనే ట్యూషన్ లు చెప్పాను. ఒక డాక్టరు దగ్గర కాంపౌండర్ గా పనిచేసాను. ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలో కనబడ్డ ప్రతీ ఉద్యోగానికి అప్లయ్ చేసాను. ఆ క్రమంలో డిగ్రీ రెండవ సంవత్సరం వేసవి సెలవుల్లో వచ్చిన ఉద్యోగం టెలికాం డిపార్టుమెంటులో షార్ట్ డ్యూటీ టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం 1981 జూన్ నుంచి 1983 డిసెంబర్ వరకూ చేసాను. తర్వాత జాబ్ పర్మినెంట్ అయి 1983 డిసెంబర్ 17న భద్రాచలంలో జాయిన్ అయ్యాను. అక్కడే దాదాపు పదిహేను సంవత్సరాలు 1998 మే 31 వరకూ పనిచేసాను. మధిరకు చెందిన సుభద్రతో 1985 ఏప్రిల్ 24న నాకు వివాహం అయింది. 1986 జూలై 13న మాకు కూతురు శ్రీ దుర్గా దీప్తి పుట్టింది. 1988 ఆగస్టు 17న అబ్బాయి వైభవ శ్రీనివాస్ పుట్టాడు. 1988 ఫిబ్రవరి 18న భద్రాచలంలో ఆవిర్భవించిన 'సాహితీ గౌతమి' కి వ్యవస్థాపక ఆర్గనైజర్ గా 1992 ఆగస్టు వరకూ పనిచేసాను. 1992 - 98 మధ్య సాహితీగౌతమికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాను. 1989 మార్చి 24న ప్రారంభించబడిన మనదేశపు మొదటి ఎఫ్ ఎం రేడియో స్టేషన్ కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమయిన మొట్టమొదటి కథ 'పోతరాజు ' నేను వ్రాసిందే. పదికి పైగా కథలు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. 1988-90 ల మధ్య ఆంధ్ర జ్యోతి వార పత్రికలో కథలు ప్రచురితం అయ్యాయి. తరువాత డ్యూటీ పనుల వత్తిడి వల్ల రచనలు చేయలేక పోయాను. 1998 జూన్ ఒకటి నుండి 2020 జనవరి 31 వరకూ ఖమ్మం లో డీవోటి/బియస్ఎన్ఎల్ లో వివిధ హోదాల్లో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రతిలిపి నెచ్చెలిలా నన్ను అక్కునచేర్చుకుంది. నా రచనలకు ఒక ఆధారాన్నీ ఊతాన్నీ ఇస్తున్న ప్రతిలిపికి ఆజన్మాంతం ఋణపడి వుంటాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    అంజనీ దేవి "Anji"
    13 মে 2024
    ఒకప్పుడు ప్రేమ పెళ్లి వరకు రావటానికి ఎన్నో ఆలోచనలు అడ్డకులు వుండేవి. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అని సరిపెట్టుకునే వాళ్లు, ఇప్పటి తరంవారికి అంత అలొచ్చన శక్తి ఓపిక లేదు. ప్రేమ వెంటనే పెళ్ళి ఒకరి అభిప్రాయాలు ఒకరికి కలవక జీవితాన్ని విడాకుల పేరుతో త్యాగం చేస్తున్నారు. చాలా బాగా రాసారు 👌👌👌👌👌👌👌👌
  • author
    Madhavi Latha Devi Kilari
    13 মে 2024
    కాలాన్ని అనుసరించి ప్రేమ కూడా. ఒకప్పటి పిరికితనం గురించి ప్రస్తుతం ప్రేమ వి‌షయంలో ఎంత స్వేచ్ఛగా ధైర్యంగా ఉంటున్నారో అనే తేడా గురించి చాలా బాగా రాశారు.అభినందనలు
  • author
    kalyani suresh
    12 মে 2024
    తరాలు మారినా భావాలు ఒకటే కానీ ఎదుటి వారిలో ధైర్యాన్నివ్వడాన్ని బట్టీ ఎదుటి వారు సాహసం చేయగలరు అని నా భావన సర్. కథ చాలా ఆసక్తికరంగా సాగింది.