మట్టిని నమ్ముకుంటే పొట్ట నిండదని, ఉన్నత చదువుల తో భవిష్యత్ కు బంగారు బాటలు వేయవచ్చు అని లేక దూరపు కొండలు నునుపు అనో పుట్టిన ఊరు వదలి.. ఊరి నుండి దూరం గా వెళ్ళిపోయిన తన బిడ్డలందరికి ఒక ఊరు ...
ప్రియాతి ప్రియమైన నా ఊరు,
నువ్వు రాసిన ఉత్తరం అందింది...
నాకూ రావాలనుంది ....చిన్నప్పటి మనజ్ఞాపకాలను మళ్ళీ నీతో పంచుకోవాలనుంది...
కానీ ఇప్పుడు నాది అనుకున్న నీవు నాది కాదంట .. ఇప్పడు కేవలం నువ్వు నాకు పుట్టిల్లేనట....
నిన్ను చూడాలనిపించినపుడల్లా నేను రాకూడదట...
ఎందుకలా????
నన్ను ఇంతదాన్ని చేసి నాకు మంచిచెడులను
నేర్పించి ఒకఅయ్యచేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నావ్ కదా....నేను కొంచం అల్లరి పిల్లనే ఆలా అని నన్ను దూరం పెడతావా...ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం...నీకు గుర్తులేదా....
మా అమ్మ నాన్న ఎలాఉన్నారు...
బాగానే చూసుకుంటున్నావా.....లేకుంటే నువ్వు మా పట్నమోళ్ళలాగ కలుషిత జీవితపు భాదలుపడి ఆ బాధని నా తల్లితండ్రులపై చూపుతున్నావా....
నా మనసు నీ వైపు పరుగులు పెడుతున్నా...నా బాధ్యతలు నన్ను ఆగిపోమంటున్నాయి...ఇంట్లో ఎవరిఒత్తిడి లేకపోయినా....పక్కదేశం నుంచి వచ్చినవాడి పోరు ఎక్కువైంది...తొందర్లోనే వస్తాను....నా మీద బెంగ పెట్టుకోకు....
నీ మూడేళ్ళ మనవడి మెదడుకి ఇప్పుడిప్పుడే రెక్కలొచ్చాయి....పచ్చని బయళ్ళలోకి ఎగరాలంటున్నాడు...పిల్ల కాలువల్లో దూకాలంటున్నాడు...వాడిని ఇంట్లోనే బంధించి బంధించి వాడి ఎదుగుదలని వెనక్కిలాగేస్తున్నా...
నేనాడిన ఆటలు నాకు నీదగ్గరున్న స్వేచ్చ...ఈ పట్నంలో నా కొడుకుకి ఇవ్వలేకపోతున్నానన్న బాధ రోజు రోజుకి ఎక్కువైపోతోంది...కనీసం నిన్ను చూపిస్తే నా గుండె కొంత కుదుట పడుతుంది....
త్వరలోనే కలుస్తా....
మా అమ్మ నాన్న జాగ్రత్త నీమీద నమ్మకంతోనే
వాళ్ళనలా ఒంటరిగా వదిలి ఉంటున్నాం...
చివరిగా ఒకమాట వీలైతే నువ్వు మాస్క్ వేసుకో పొలిమేర దగ్గర సబ్బు ,నీళ్లు ఉంచు జాగ్రత్తగా ఉండు...నీకేమన్నా వస్తే కుదురుగా ఉండేరకం కాదు నువ్వు అందుకే నా బెంగ నీ మీద...
సరే ఇక సెలవు...
ఇట్లు
నీ ఊరమ్మాయి...
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు