నేను మాతామహుల ఇంట్లో హిమాచల్ ప్రదేశ్ (సిమ్లా)లో 1949లో జూన్‌లో పుట్టాను. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాభ్యాసం చేశాను. ఆంగ్ల సాహిత్యంలో పిహెచ్‌డి చేసాను. విశాఖపట్నం ఎ.వి.యన్ కాలేజి, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కాలేజీతో పాటు విశాఖపట్నం వి యస్ క్రిష్ణా ప్రభుత్వ కాలేజిలోనూ పనిచేశాను.
వివాహానంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయం వారి శ్రీ వేంకటేశ్వర కాలేజిలోనూ అధ్యాపకురాలిగా పనిచేశాను. చివరగా ఐ.ఐ.టి ఢిల్లీలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగంలో 17 సంవత్సరాలు అధ్యాపకురాలుగా పనిచేసి 2010లో రిటైర్ అయ్యాను. విశాఖపట్నంలో విశ్రాంత జీవితం గడుపుతున్నాను. భర్త ఫ్రొఫెసర్ కల్లూరి సూర్యప్రకాశరావు ఐ.ఐ.టి డిల్లీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ 1995లో దివంగతులైనారు. మాకు ఇద్దరమ్మాయిలు అహన, కృత్తిక.
నా సాహితీ వ్యాసంగం:
రవీంద్రనాధ్ టాగూర్ విరచిత 'స్ట్రే బర్డ్స్' తెలుగు అనువాదం 1988 లో విశాలాంధ్ర వారిచే ప్రచురితమైంది
తెలుగు షార్ట్ స్టోరీస్, విమెన్స్ వాయిసెస్: యాన్ ఇన్నర్ వాయేజ్ (1930-2000) (ఇరవై శతాబ్దపు స్త్రీల కథలు అనువాద కథలు) యేసిఅన్ పబ్లికేషన్స్ డిల్లీ, 2001
ట్వెంటియత్ సెన్చురీ తెలుగు పొయెట్రీ, షిప్రా పబ్లికేషన్స్ డిల్లీ (2006)
స్వగతాలు - తెలుగు కవితల సంకలనం సూర్య ప్రచురణలు హైదరాబాదు (2008)
ఇఫ్ యు వాంట్ టు బి ఎ పొయెట్, పాట్రిడ్జ్ ఇండియా ప్రచురణ, 2016
శ్రీ రమణ విరచిత మిథునం కథానువాదానికి కథ సాహిత్య పురస్కారం (1998)
జ్యేష్ఠ అనువాద పురస్కారం (2001)
వంగూరి ఫౌండేషన్ ఆంధ్రప్రభ ద్వారా నిర్వహింపబడిన రెండవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథలపోటీలో పిడికడంత గుండె హిమాలయమంత మనిషి కథకి ప్రశంశా పత్రం.
ఇవికాక అనేక అకడమిక్ వ్యాసాలు వృత్తి పరంగా ప్రచురించబడ్డాయి.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్