నా చదువు పదవి తరగతి ఉత్తీర్ణత అదికూడా రెండంచెలగా.
నాలుగు సంవత్సరాలు గాత్ర సంగీతంలో పరిచయ శిక్షణ. నాలుగు సంవత్సరాలు మృదంగంలో పరిచయ శిక్షణ ఏడు సంవత్సరాలు భరత నాట్యం (ఉత్తీర్ణత) ఎనిమిది సంవత్స రాలు కూచిపూడి ఆకాశవాణిలో నాటక విభాగంలో 'బి' స్థాయి పాత్ర గాత్ర దాన కళాకారుడిని. 15 సంవత్సరాలు స్మార్తం, వేదం అభ్యాసం. కించిత్ సాహిత్య పరిచయం. ఇప్పటికే ప్రతిలిపిలో పలు కవితలు, వ్యాసాలు, కథలు ప్రచురితం.
కళాసరిత్సాగరం, పర్వదినాలు-పరమార్థాలు, , పదవర్ణం-అభినయ పదం, ఏక పాత్రాభినయం అనే పుస్తకా లు ప్రచురించబడ్డాయి. మొదటి రెండు పుస్తకాలకి Central Institute of Indian Languages, Mysore గుర్తించి...30, 24 వేల రూపాయలు అందించింది.
నాలుగు నృత్య రూపకాలు, అందమైన తెలుగు పేరిట ఆరు పాటలు, కనుకమహాలక్ష్మి అమ్మవారిమీద పాటలు, హిందూ వివాహంలో ముఖ్య ఘట్టాలమీద 'కల్యాణ వైభోగం' 2005 దృశ్య మాధ్యమంలో 'మహా విశాఖ వైభవం', '2006 Win India' పేరిట పాటలు విడుదలయ్యాయి. వీటిల్లో మహా విశాఖ వైభవం పాటకి మహా విశాఖ నగర పాలక సంస్థ 70 వేల రూపాయలు అందించింది.
రెండుసార్లు కులంమనాలి మంచు పర్వతాలు అధిరోహణ, ఓసారి నాయకునిగా పాల్గొన్నాను. ఓసారి రాజస్థాన్ థార్ ఎడారిలో నడక సాగించాను.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్