పుట్టినతేది. 25-07-1963
స్వస్థలం: కరీంనగర్ జిల్లా వీణవంక.
ప్రస్తుత నివాసం. హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా.
కవి కథా రచయిత శ్రీదాస్యం లక్ష్మయ్య ఇప్పటి వరకు భావచిత్రాలు (1982) , తండ్లాట (2002) కవితా సంకలనాలను,బుర్కపిట్టలు(2006) నానీల సంకలనం మరియు శ్రీదాస్యం లక్ష్మయ్య కథలు (2017) కథాసంకలనం వెలువరించారు. 2017లో గునుకపువ్వు కవిత్వం సంకలనం వెలువరించారు.
ఉదయసాహితిప్రచురణలుగా 2004 నుండి2016 వరకుపరస్పర ఆర్థికసహకార పద్దతిలో ఇప్పటివరకూ 11 కవిత్వం సంపుటిలకు సంపాదకత్వం వహించారు.
2017 నవంబర్ లో గురజాడఫౌండేషన్ ( USA ) వారిచే విశిష్ట రాష్ట్రస్థాయిపురస్కారం సినీగేయకవి సుద్దాల అశోక్తేజ చేతులమీదుగా ముంబైలో అందుకున్నారు.
2018 ఫిబ్రవరి 11 న బాసరలో జరిగిన తెలుగుకవితావైభవం వారి బాసరసహస్ర కవితోత్సవంలో విశిష్ట సాహితీ సేవారత్న బిరుదును మేక రవీంద్ర , ప్రముఖకవి దాస్యం సేనాధిపతి గారలచే అందుకున్నారు.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్