వలపన్నది వరమివ్వని కనుచూపును పంచలేని మాటన్నది పలుకలేని ఓ పడతి వెళ్ళిపో నీ కావ్యం నీదిగా నా రాగం నాదిగా సాగిపోయే స్వరాగాలతో పలుకలేని పల్లవి వెళ్ళిపో దూరమయ్యే ప్రేమను దారమేసి లాగకు పంచబోని ప్రేమను పంతమై కోరకు నా జీవం నాదిగా నీ బ్రతుకు నీదిగా గూడు పైన ఎండగా దరిచేరని నీడగా పోట్లాటపు మాటలతో నలిగిన, విసిగిన, అలసిన తెగి ఎగిరే గాలిపటమా వెళ్ళిపో వెళ్ళిపో విడిపోయిన ప్రేమికులు వారి మనసులలో వెల్లువించే విరహవేదన ఈ నా అక్షర వేదన.. జొన్నలగడ్డ రాజ శేఖర్ రాజు తిరుపతి ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్