2010లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. చదవడమంటే ఇష్టం. కథలు రాయాలనే అభిలాషతో రాసిన తొలి కథ “కృష్ణం వందే జగద్గురుం” కౌముదిలో ప్రచురిచతమైంది. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా అరవయి. తొలి కథ కౌముది అంతర్జాల మాసపత్రికలో ప్రచురితమైంది. నవ్య,ఆంధ్రభూమి,స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి వంటి వార,మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ వంటి దినపత్రికలలోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ,అంతర్జాల పత్రిక లైన ,కౌముది,మధురవాణి,సంచిక,రస్తా,నెచ్చెలి లలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గ వచ్చి ,పుస్తకం గ వెలువడింది బహుమతుల వివరాలు: 1. గో తెలుగు.కాం వారి హాస్య కథల పోటిలో ప్రథమ బహుమతి 2. ఫేస్బుక్ లోని కథ గ్రూప్ నిర్వహించిన కథల పోటిలో ప్రథమ బహుమతి 3. అమెరికా తెలంగాణా సంఘం (ATA) వారి సావనీర్ కు పెట్టిన కథల పోటిలో మొదటి బహుమతి. 4. వంగూరి ఫౌండేషన్ వారి మధురవాణి.కాం వారు నిర్వహించిన పోటిలో మేనిక్విన్ కథకి ఉత్తమ కథ బహుమతి.,visakha samskruti వారి ప్రోత్సాహకబహుమతి,హాస్యానందం వారి పోటి లో కన్సొలేషన్ బహుమతి వచ్చాయి..
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్