- సూపర్ రైటర్ అవార్డ్స్ -8: 120+ కొత్త రచయితలు17 డిసెంబరు 2024గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి, ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఎనిమిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. 120 భాగాల సిరీస్ రాయడం అంత తేలికైన విషయం కాదు. ప్రతి భాగాన్ని ఆసక్తికరంగా, పాత్రలతో పాఠకుల మనసులను కట్టిపడేస్తూ రాయడం అనేది గొప్ప నైపుణ్యానికి నిదర్శనం. అలాగే, కొత్త రచయితగా క్రమం తప్పకుండా రాస్తూ, ప్రొఫైల్ లో మొదటి సారి 80 భాగాల సిరీస్ రాసినరచయితలందరికీ మా హృదయపూర్వక అభినందనలు! ప్రతిలిపిలో మీరు మరిన్ని సిరీస్ రాస్తూ, విజయవంతమైన రచయితగా ఎదగాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము. 120+ భాగాల సిరీస్ రాసిన రచయితలు:ఇంటర్వ్యూ చేసి, రచయితల ప్రొఫైల్ ప్రతిలిపి సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం జరుగుతుంది. ఫణికిరణ్ - నువ్వే కావాలంటోంది నా ప్రాణం అనామిక - నీ ప్రేమకై నర్మద ఏశాల - తిమిరరుద్రస్య వినీల - నీ పరిచయమే రమ్య - మంచి మనసులు ఎల్ల లోవ - అవంతి మహాల్ (మాయాత్మిక) శసాంగ్ - కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ N S R - మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ Rsp మాధవి కృష్ణ - అగ్నిపునీత ఈ పెళ్ళి నాకొద్దు G కాత్యాయిని - ప్రేమార్థం నాగ శిరీష - ముగ్గురు అమ్మాయిల కథ యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు - అధికారం సాయి ప్రవళ్ళిక - కలల తీరం అనురాధ మురుగము బూజుల - వలయం జానకి - నమ్మవే సఖియా వెంకట హరిత - మైత్రి వనం పూజారుల రంజిత - నిన్నే వలచాను షేక్ జమీల భాను - వెంటాడే శాపం రాజేష్ తొగర్ల - ఊహించని ప్రేమకథ షేక్ జమీల భాను - చుక్కల చీర కట్టి చక్కగున్నావే శైలజ - యు అర్ మై క్రష్ సౌజన్య రామకృష్ణ - మాయ 23.పావని - నీ తలపులే నా ఊపిరి పోటీ నియమాలను పాటిస్తూ,మొదటిసారి 80 భాగాల సిరీస్ పూర్తి చేసిన రచయితలందరికీ అభినందన పత్రం మెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. గోవర్ధన్ రెడ్డి - మహా సంగ్రామం శసాంగ్ - కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ నాగ శిరీష - ముగ్గురు అమ్మాయిల కథ పూజారుల రంజిత - నిన్నే వలచాను శైలజ Vsr - యు అర్ మై క్రష్ వందన - నువ్వు నేను ప్రేమ సౌమ్య - నీతో నేను ఉండిపోనా శైలజ మల్లిక్ - నాతిచరామి మధు మయూఖ - మోహం శ్రీ రమ్య - అభిలాష తేజు చిన్ని - నీ ప్రేమ కోసం ఆమని రెడ్డి - ప్రేమ పోరాటం కళ - నాకై నువ్వు ఉండి తీరాలి సువర్ణ రెడ్డి - వలయం శిరీష బేత - ఒంటరి మైథిలి నిధి - మనసున మందారమాల అక్షయ చౌదరి - సజీవ సాక్ష్యం అల్లరి పిల్ల - ఆడది కాదు ఆడపులి (ips) 19.పావని -నీ తలపులే నా ఊపిరి అతి పెద్ద సిరీస్ లు రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 9' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు. https://telugu.pratilipi.com/event/dal39cyuw8 శుభాకాంక్షలు ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- సూపర్ రైటర్ అవార్డ్స్ -8 ఫలితాలు17 డిసెంబరు 2024గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి, ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఎనిమిదవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము. ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడా విజేతలుగా భావించి ప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. సూపర్ రైటర్ అవార్డ్స్-8 విజేతల జాబితా మొదటి 5 మంది విజేతలు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం+ ₹5000 నగదు బహుమతి + విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ వర్షం సాక్షిగా - తేజు పర్ణిక నమ్మవే సఖియా - జానకి నువ్వే కావాలంటోంది నా ప్రాణం -ఫణికిరణ్ సీతాకోకచిలుక - స్వాతి నాతిచరామి - శైలజ మల్లిక్ 6 - 10 విజేతలకు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం + ₹3000 నగదు బహుమతి + విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. ఝాన్సీ ఐపీఎస్ - స్నిగ్ధ నీడ - రాధిక ఆండ్ర రుధిరశిశిరం - అంజని గాయత్రి మోహం - మధు మయూఖ అంతర్మథనం - వేణు కిషోర్ 11- 20 విజేతలకు: ప్రత్యేక బహుమతి మీ ఇంటి చిరుమాకు పంపడం + ₹1000 నగదు బహుమతి +విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. నిశి కన్య - కిరణ్మయి క్షమయా ధరిత్రి - మీనాక్షీ శ్రీనివాస్ నీ తోడునై - ఆనందోబ్రహ్మ ప్రేమిస్తున్న- అలేఖ్య ముగ్గురు అమ్మాయిల కథ - నాగ శిరీష రేప్ విక్టిమ్ - గౌరి పొన్నాడ క్రాంతి కిరణం - శ్రీదేవి మహా సంగ్రామం - T. గోవర్ధన్ రెడ్డి ఊహించని ప్రేమకథ - రాజేష్ తొగర్ల ప్రేమార్థం - G. కాత్యాయిని న్యాయనిర్ణేతలు మెచ్చిన మరిన్ని రచనలు : విజేతలకు అందించే ప్రశంసా పత్రం మెయిల్ చేయడం జరుగుతుంది. కానూరు సాయి లక్ష్మి కళ్యాణి - అక్షయ్ బుజ్జమ్మ - నీ జతే నే కోరుకున్న సుష్మ సిరి - శిశిరం నివేదిత ఆదిత్య - మధు కావ్యం వేద వేదస్విని - దాక్షాయని పరిణయం వేద వేదస్విని - పెంకి పెళ్లాం స్వేచ్ఛ - సీతాకోకచిలుక లీల - మిస్టర్ శాడిస్ట్ గారి తింగరి పెళ్ళాం చైతన్య - ఫార్మ్ హౌస్... (ఆత్మలకు మాత్రమే..) మాధవి - పెదవి దాటని మాట భాగిi - దివిజా వల్లభుడు వెంకట లక్ష్మి దీప్తి - ఆమె మనిషే కాదా??ఆమెది మనసేగా A❤️J - వీడని ఆత్మ శశిరేఖ లక్ష్మణన్- నెపొటిజం గగన సుహా- శుభమస్తు తనూష రెడ్డి - పసిడి వెన్నెల పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసాపత్రాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. ప్రతిలిపి యాప్ హోం-పేజీలో ఉన్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి వచ్చిన రచనలు' అనే బ్యానర్ లో మీ సిరీస్ లను జత చేస్తాము. అతి పెద్ద సిరీస్ లు రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 9' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు. https://telugu.pratilipi.com/event/dal39cyuw8 శుభాకాంక్షలు ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- ట్రెండింగ్ థీమ్ & ప్లాట్ ఆలోచనలు14 అక్టోబరు 2024అతిపెద్ద సిరీస్ రాయడానికి అవసరమైన అన్ని అంశాలను నేను ఎలా నేర్చుకోవాలి? ఈ క్రింది టిప్స్ సహాయంతో సిరీస్ రైటింగ్ లో గొప్ప రచయితగా మారండి: ప్లాట్లు పాత్రలు: ప్లాట్ ఆలోచనను అతిపెద్ద సిరీస్‌గా ఎలా అభివృద్ధి చేయాలి? పాత్రలు మరియు ఉప ప్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలి? నిర్దిష్ట శైలి: ప్రేమ వర్గంలో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? ఫ్యామిలీ డ్రామా, సోషల్ మరియు మహిళా థీమ్స్‌లో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? మిస్టరీ, ఫాంటసీ మరియు హారర్ థీమ్‌లతో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? ఆసక్తికరమైన థ్రిల్లర్ సిరీస్‌ను ఎలా రాయాలి? రాసే పద్ధతులు: పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెంట్లు మరియు వాటి సీక్వెన్స్ మరియు ప్లాట్ హోల్స్‌ను అర్థం చేసుకోవడం సిరీస్ భాగాలు మరియు సీన్స్ ఎలా రాయాలి? డైలాగ్ రైటింగ్ టెక్నిక్స్ మరియు మొదటి చాప్టర్ స్ట్రాటజీస్ హుక్స్ మరియు ప్లాట్ ట్విస్ట్‌లు: వాటిని ఎఫెక్టివ్‌గా ఉపయోగించడం మరియు చిరస్మరణీయమైన సిరీస్ ముగింపుని ఎలా రూపొందించాలి? విభిన్న భావోద్వేగాలను ఎలా రాయాలి? ప్రణాళిక మరియు సవాళ్లను అధిగమించడం: రైటింగ్ షెడ్యూల్ ఎలా తయారు చేయాలి? రాసేటప్పుడు సాధారణ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు (నిరోధాలు/ఒత్తిడి/సమయం) ప్రతిలిపిలో అతిపెద్ద సిరీస్ యొక్క ప్రయోజనాలు: ప్రతిలిపి అతిపెద్ద సిరీస్‌లను ఎందుకు ప్రోత్సహిస్తుంది? జనాదరణ పొందిన సిరీస్ నిర్మాణాన్ని విశ్లేషించడం పాఠకులను ఆకర్షించడం (ప్రమోషన్) రికమెండేషన్ సిస్టం అర్థం చేసుకోవడం ప్రీమియం సిరీస్‌తో నెలవారీ రాయల్టీలను పొందడం సీజన్స్ రాయడం అతిపెద్ద సిరీస్ విజయం యొక్క ప్రయోజనాలు ఫెలోషిప్ ప్రోగ్రాం 1 ఫెలోషిప్ ప్రోగ్రాం 2 పోటికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి [email protected]కి మెయిల్ చేయండి. మా టీం 24 గంటలలోగా మీ సమస్యను పరిశీలించి, రిప్లై ఇస్తారు. ప్రతిలిపి వేలాదిమంది రచయితలతో రోజూ పనిచేస్తూ వారి కలలను సాకారం చేస్తోంది. మేము, మీ కోసం ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించాము. మీ సాహిత్య ప్రతిభను ప్రతిలిపి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి రచయితగా ఎదగవచ్చు మరియు మీ రచనల నుండి ప్రతీనెల సంపాదించుకోవచ్చు. పోటీలో పాల్గొని, బెస్ట్ సెల్లర్ రచయితగా నిలవాలనే మీ కలను నిజం చేసుకోండి. ఆల్ ది బెస్ట్! ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- CEO లెటర్13 సెప్టెంబరు 2024గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్ గారికి, మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాము. పది సంవత్సరాల క్రితం, ప్రతిలిపి ఒక చిన్న గదిలో ఆవిర్భవించింది. పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా, ప్రతిలిపి ప్రయాణాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2014 సెప్టెంబర్ 14న, ప్రతిలిపి వెబ్సైట్ బీటా వెర్షన్‌ను నాతో సహా ఐదుగురు స్నేహితులతో కలిసి విడుదల చేసాను. ఆ సమయంలో చాలామంది నాపై అనేక ప్రశ్నలు సంధించారు. కానీ, నేను ఒకే ఒక నమ్మకంతో ముందుకు నడిచాను: కలలకు, ఆశయాలకు భాష ఉండదు. ప్రతిలిపి రచయితలు ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ రచనలను ప్రపంచం ముందు ఉంచాలనే లక్ష్యంతో ముందుకు సాగాను. నా ప్రయాణం తేలికైనది కాదని తెలుసు. అయితే నా ఆశయానికి కాస్త దగ్గరగా వెళ్లగలిగినా, దానిని విజయంగా భావించాలనుకున్నాను. ఎంత కష్టమవుతుందో, ఎంతవరకు విజయం సాధిస్తానో ఊహించలేదు. మొదట్లో కేవలం వందలమంది రచయితలు మాత్రమే తమ రచనలను ప్రచురించేవారు. వారి రచనలకు నెలలో అతితక్కువ రీడ్ కౌంట్ (వందలోపే) వచ్చేది. ఇప్పుడు, నా కుటుంబం మిలియన్ల రచయితల కుటుంబంగా ఎదిగింది. మీ అందరి రచనలను ప్రతివారం వందల మిలియన్ల మంది చదువుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం వరకు, ప్రతిలిపిలో సంపాదించే అవకాశం లేదు. మీరందరూ, మీ రచనలను పాఠకులు చదివితే చాలనుకున్నారు. మీ రచనల తదుపరి భాగాల కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. గత నెలలో, అదే పాఠకులు 1.5 కోట్ల రూపాయలను అందించారు. అందులో 18 మంది రచయితలు ఒక్కొక్కరూ ఒక లక్ష రూపాయలను, 500 మంది రచయితలు ఒక్కొక్కరూ 5000 రూపాయలు సంపాదించారు. ఇదంతా ప్రతిలిపి సబ్స్క్రైబర్ల వల్లే సాధ్యమైంది. కొన్ని నెలల క్రితం వరకు కూడా ప్రతిలిపిపై చాలామంది అపనమ్మకంతో ఉన్నారు. ప్రతిలిపి రచయితలను, వారి రచనలను తక్కువ అంచనా వేశారు. కానీ ఈరోజు, ఐదు టీవీ సీరియల్స్, ఒక వెబ్‌సిరీస్ ప్రతిలిపి రచయితల రచనల నుండి విడుదలయ్యాయి. ఇంకా మరెన్నో రచనలు సినిమాలు, సీరియల్స్, వెబ్‌సిరీస్‌లు, అనేక ఇతర ఫార్మాట్లలో రానున్నాయి. ఈ ప్రయాణం తేలికగా సాగలేదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. శరీరంలో ఎలాంటి సత్తువ లేకుండా నిద్ర లేచేవాడిని. నా టీం మొత్తం చాలా ఒత్తిడికి గురయ్యింది. నా ఆశయానికి జీవం పోయడానికి నాతో పాటు ప్రతిలిపి టీం మొత్తం నాపై నమ్మకాన్ని ఉంచింది. నా ఆశయం ఊపిరి పోసుకోవడానికి ప్రధాన కారకులు, ప్రేరకులు మీరే. మీరే లేకపోయి ఉంటే నా కల నిజమయ్యేది కాదు. ప్రతిలిపిపై మీరు పెట్టుకున్న నమ్మకం, చూపించిన ప్రేమ కారణంగానే నా ఆశయం కొనసాగుతోంది. ఈ ప్రయాణం చిన్నదేమీ కాదు. ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ప్రతిలిపి రచయితలు అనేక విజయాలు సాధించాలి. కొన్ని వేలమంది రచయితలు ప్రతిలిపి సంపాదనతోనే వారి కలలను సాకారం చేసుకోవాలన్నది నా కల, ఆశయం. నా రచయితలందరూ ఆర్థికంగా మెరుగుపడాలి, సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలి. అది సాధించే వరకు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ప్రపంచప్రఖ్యాత రచయితల సరసన ప్రతిలిపి రచయితలను నిలబెట్టేవరకు ఈ కృషి సాగుతూనే ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది కిందకు లాగడానికి ప్రయత్నించినా, పరిగెడుతూనే ఉంటాను. పరిగెత్తలేకపోతే నడుస్తాను; అది కుదరకపోతే, పాకుతూ అయినా లక్ష్యం వైపే నా అడుగులు సాగుతాయి. నా ఈ ప్రయాణంలో మీ అందరి అడుగులు పడాలని ఆహ్వానిస్తున్నాను. ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది! రంజీత్ ప్రతాప్ సింగ్ప్రతిలిపి సీఈఓసంపూర్ణంగా చూడండి
- ప్రతిలిపి రచయితల ప్రయాణం13 సెప్టెంబరు 2024ప్రతిలిపి రచయితల రచనా ప్రయాణంలో కొన్ని భావోద్వేగ సందర్భాలు: 1.కల సాకారమైన వేళ కనక్ గారు తన రచనలను ప్రతిలిపిలో స్వీయ ప్రచురణ చేసి, కలల్ని ఆదాయంగా మలుచుకున్నారు. మొదటి సంపాదనతో, స్కూటీ కొనుగోలు చేసి "రాంప్యారి" అని పేరు పెట్టారు. ఈ విజయంతో, తన పాఠకులకు కనక్ గారు కృతజ్ఞతను వ్యక్తపరిచారు. ధైర్యం, పట్టుదలతో కలలు నిజం చేసుకోవచ్చని కనక్ గారి కథ చెబుతోంది. 2.ప్రేమ కానుక శిఖా గారు వారి తల్లి గారి కోసం డైమండ్ కమ్మలు కొనాలన్న చిరకాల కలను ప్రతిలిపి సంపాదనతో నిజం చేసుకున్నారు. ఆ సంతోషకరమైన సందర్భం, వారిద్దరికీ సువర్ణ జ్ఞాపకంగా నిలిచిపోయింది. సృజనాత్మకతతో సాహిత్యం రచించడం ద్వారా విలువైన కానుకలను కుటుంబ సభ్యులకు అందించగలమని నిరూపితమైంది. శిఖా గారి కథ ద్వారా మర్చిపోలేని జ్ఞాపకాలను గుండె లోతుల్లో ఎలా పదిలపరుచుకోవచ్చో తెలుస్తోంది. 3.బాధ్యతలు - కలలు రీమ గారు ఇంటిపనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ రాయడమనే తన అభిరుచిని వదులుకోలేదు. ప్రతిలిపిలో పాఠకురాలిగా మొదలై విజయవంతమైన రచయిత్రిగా ఎదిగారు. రీమ గారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే! ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే, రాయడమనే అభిరుచి ఉంటే ఎలా ఎదగవచ్చో, కలలను ఎలా సాకారం చేసుకోవచ్చో నేర్చుకోవచ్చు. వీరి ప్రయాణం ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. 4.కష్టాల నుండి విజయం దాక శ్రీ గారు ఆర్థిక ఇబ్బందుల వలన అనేక సవాళ్లను ఎదుర్కున్నారు. అవసరమైన సమయంలో ప్రతిలిపి నుండి వచ్చిన మొదటి ఆదాయం కొత్త ఆశను రేకెత్తించింది. సృజనాత్మకతతో రాయడం ద్వారా కష్టాల చీకటి నుండి విజయాల వెలుగులోకి ఎలా ప్రయాణించవచ్చో శ్రీ గారి మార్గమే చక్కటి ఉదాహరణ. 5.పాఠకుల అనుబంధమే మహా బలం జ్వాలాముఖి గారు ప్రతిలిపిలో చిన్న కథలను రాస్తూ, పాఠకుల సహకారంతో తిరుగులేని రచయిత్రిగా ఎదిగారు. జ్వాలాముఖి గారి రచనలు పాఠకులను తీవ్రంగా ప్రభావితం చేయడం వల్ల వారి కథలు ఆడియో, పుస్తకాలుగా వచ్చాయి. పాఠకులతో బలమైన సంబంధాలు ఉండటం వల్ల ఎలా ఎదగచ్చో వీరి విజయ మార్గం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం జ్వాలాముఖి గారు ఫుల్ టైం రచయిత్రిగా రచనా ప్రయాణంలో కొనసాగుతున్నారు. పాఠకుల బలమే రచయితలకు అండ. 6.సమాజాన్ని మార్చే సాహిత్యం మయూరి గారు రచనల ద్వారా సామాజిక సమస్యలపై పాఠకులకు అవగాహనను కల్పిస్తున్నారు. తన సంపాదనను అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చి ఆదుకోవడం గొప్ప లక్ష్యానికి ప్రతీక. వారి కథలు సమాజంలో మార్పును తీసుకురావడంలో ఎంత ప్రభావవంతంగా ఉంటాయో తెలుస్తోంది. ఉన్నతమైన సమాజం కోసం తన వంతు భాద్యతగా రచనల ద్వారా సమాజాన్ని ఉద్దరించడం ఎలానో వీరి కథ ద్వారా తెలుస్తోంది. 7.చిన్ని కోరిక హకీంకి సైకిల్ కావాలనే కోరిక కోరికగానే మిగిలిపోతుందనుకునే సమయంలో తన తండ్రి గారు ప్రతిలిపిలో ప్రచురించడం మొదలుపెట్టారు. హకీం తండ్రి గారు.. వారి అనుభవాలను రచించి హకీం చిన్న కోరికను తీర్చారు. మనలోని సృజనాత్మక రచయితను కనుగొని, అనుభవాలను రచించడం ద్వారా పిల్లల చిన్ని చిన్ని కోరికలను ఎలా నేరవేర్చవచ్చో అర్థమౌతోంది. ప్రతి విజయం వెనుక అసాధారణమైన శ్రమ, పట్టుదల, ఆశయం ఉంటాయని పై ప్రతిలిపి రచయితల కథల ద్వారా తెలుసుకోవచ్చు. ప్రతిలిపి రచయితల విజయగాధల ద్వారా ప్రేరణ చెంది విజయం వైపు ప్రయాణించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాము.సంపూర్ణంగా చూడండి
- సూపర్ రైటర్ అవార్డ్స్ : సూపర్ 7 సీజన్ ఫలితాలు19 జులై 2024గౌరవనీయులైన ప్రతిలిపి యూజర్స్ కి, ప్రతిలిపి సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీ మరోసారి అద్భుతంగా నిర్వహించబడింది! ఈ పోటీ ఏకంగా ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని, మేము ఏడవ సీజన్ ఫలితాలను ప్రకటించడానికి ఉత్సాహంగా మీ ముందుకు వచ్చాము. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సాహిత్య పోటీలో పాల్గొన్న ప్రతి రచయితకు మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీకి వచ్చిన అద్భుతమైన రచనలు మమ్మల్ని గర్వపడేలా చేశాయి. వందలాది రచనల నుండి మా న్యాయనిర్ణేతల బృందం ఎన్నుకున్న ఉత్తమ రచనల ఆధారంగా ఈ విజేతలను ఎంపిక చేశాము. ఈ పోటీలో విజయం సాధించిన రచయితలను మాత్రమే కాకుండా మిగతా విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రచయితలను కూడావిజేతలుగా భావించిప్రతిలిపి అభినందిస్తోంది. ఈ పోటీకి వచ్చిన ప్రతి రచన ప్రత్యేకమైనది. ప్రతిలిపి రచయితల సాహిత్య ప్రతిభకి గౌరవంగా తలవంచుతున్నాము. ఈ పోటీలో పాల్గొనడం ద్వారా మీ రచనలను మేము చదివేలా చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సాహిత్య కృషి, సాహిత్య ప్రపంచానికి ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఇలాగే మీరు ముందుకు సాగుతూ, సాహిత్య రంగంలో మరింత వర్ధిల్లాలని, ప్రతిలిపి మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. సూపర్ రైటర్ అవార్డ్స్-7 విజేతల జాబితా : పాఠకుల ఎంపిక పోటీకి వచ్చిన రచనలను ఒక దగ్గర చేర్చి, పోటీ ప్రారంభ తేది నుండి ముగింపు తేది వరకు ఉన్న రీడ్ కౌంట్,ఎంగేజ్మెంట్ స్కోర్, అనుచరుల సంఖ్య ఆధారంగా విజేతలను ఎంపిక చేయడం జరిగింది. మొదటి విజేత:5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం అతిథి-Siri అర్జున్ రెండవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం నిషీధిలో గోపికాన్విత-D. సునీల్ రెడ్డి క్రిష్ణ మూడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం మధుకావ్యమై-వాసుకి నూచెర్ల నాల్గవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం ఓయ్ పిల్లా నీ గొప్పేంటి-Rsp. మాధవి కృష్ణ ఐదవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం ఇది వెన్నెల రాత్రి-siri కృష్ణ ఆరవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం ఊరిచివరి బంగ్లా-ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి ఏడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం నీ తలపులే నా ఊపిరై-శ్రీ దేవి శ్రీ న్యాయనిర్ణేతల ఎంపిక పాఠకుల ఎంపిక అయిన తర్వాత, విజేతల రచనలను మినహాయించి, మిగిలిన రచనల నుండి న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచనలను విజేతలుగా ప్రకటించడం జరిగింది. మొదటి విజేత:5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం జన్మసార్థకథ-యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు సి యస్ యస్ సుజాత రెండవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం అతడు, ఆమె-మీనాక్షీ శ్రీనివాస్ మూడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం ప్రణయ దీపిక-వెంకట హరిత నాల్గవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం పెళ్లి-లక్ష్మీ ఐదవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం కన్యాదానం-దుర్గా భవాని జామి చైతన్య ఆరవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం అద్దె గర్భం-లహరి రాజశేఖర్ ఏడవ విజేత: 5,000 నగదు బహుమతి + ప్రత్యేకంగా ఫ్రేమ్‌తో కూడిన ప్రశంసాపత్రం చి. ల. సౌ-రామ్ ప్రకాష్ 77 భాగాల ఛాలెంజ్ ఛాలెంజ్ పూర్తి చేసిన రచయితలకు ప్రత్యేక ప్రతిష్ఠాత్మకమైన రాజపత్రంమెయిల్ ద్వారా పంపడం జరుగుతుంది. కృషి, పట్టుదలతో 77 భాగాల ఛాలెంజ్ పూర్తి చేసిన రచయితలకు శుభాకాంక్షలు. భవిష్యత్తులో 100+ భాగాల ఛాలెంజ్ తప్పకుండా పూర్తి చేసే సత్తా మీలో ఉందని మేము నమ్ముతున్నాము. వరుస రచన రచయిత 1 నీ జతకై వేచే నా మనసు నందన 2 సాగరతీరాన సప్తపది కొడపర్తి దివ్య ప్రేరణ 3 ఏ దారెటు పోతుందో.. హేమంత అగస్త్య ప్రగడ 4 నా అందాల రాక్షసి విజయ గండికోట 5 వదిలి వెళ్ళకే నా రాక్షసి త్రివేణి 6 ముడి పడని పెళ్లి బంధం నా ఊహ 7 కవ్వించే ప్రేమిక అనురాధ మురుగము బూజుల 8 వైఫ్ అఫ్ ఆర్య రాజ్ కమల్ 9 చెప్పవే ప్రేమ స్వీటి 10 అభినవ్ కృష్ణ ఆఖరి పేజీ అనూరాధ రాపర్తి 11 మౌనం వీడవే ప్రియా లావణ్య 12 దాక్షాయిని మహిత రెడ్డి 13 నీ జత నేనై హేమ కరేటి 14 Who am I? కిరణ్మయి 15 Mr Mrs Ram జ్యోతిక 16 అభినవ సీత శ్రీమతి కుమారి 17 పర్ణశాల రాజేష్ తొగర్ల ఇక్ష్వాకు 18 నిశీధిలో రావణపురం రాధిక ఆండ్ర 19 ప్రేమ కుసుమ సాంబశివ కుసుమ 20 రావణలంకలో సీత స్వయంవరం సుష్మ 21 అనుకోని ప్రయాణం.. చైతన్య వర్మ 22 యునిక్ లవ్ మీర మా న్యాయనిర్ణేతలు మెచ్చిన రచనలు వరుస రచన రచయిత 1 ఆయన కోసం గౌరి పొన్నాడ 2 మనసా ఒట్టు మాట్లాడొద్దు ఆమని 3 చదరంగం మై డ్రీం స్టోరీస్ 4 మగువ... ఓ... మగువ రేష్మ 5 చారుశీల సువర్ణ రెడ్డి 6 మనసే బంగారు తాళి జానకి 7 మిడ్ నైట్ మర్డర్స్ స్నేహ 8 లవ్ టుడే స్వాతి నక్షత్ర 9 అనుకోలేదు వెన్నెల 10 శార్దూలరాగం నర్మద ఏశాల 11 నిశీధిలో రావణపురం రాధిక ఆండ్ర 12 టచ్ మీ నాట్ రమిజ్యోతి పోటీలో పాల్గొన్న రచయితలందరికీప్రశంసాపత్రాన్ని మెయిల్చేయడం జరుగుతుంది.ప్రతిలిపి యాప్ హోం-పేజీలో ఉన్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి వచ్చిన రచనలు' అనే బ్యానర్ లో మీ సిరీస్ లను జత చేస్తాము. అతి పెద్ద సిరీస్ లు రాసిన రచయితలను ప్రతిలిపి అభినందిస్తోంది. మీ విజయం ప్రతిలిపి విజయంగా భావిస్తున్నాము. ప్రతిలిపి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి, పూర్తి చేయడంలో ఉన్న మీ ప్రతిభను అభినందిస్తున్నాము. ప్రస్తుతం జరుగుతున్న'సూపర్ రైటర్ అవార్డ్ - 8' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. పోటీ వివరాల కొరకు ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు. https://telugu.pratilipi.com/event/f9i7gsf9ky శుభాకాంక్షలు ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- సంపాదన పెంచుకోవడానికి ఉపయోగపడే చిట్కాలు20 మే 2024మీ అవార్డ్-విన్నింగ్ సిరీస్‌ని సిద్దం చేసుకోండి: సూపర్ రైటర్ అవార్డ్స్ కోసం చిట్కాలు ప్రాంప్ట్‌లు! గౌరవనీయులైన రచయిత గారికి, పాఠకులను కట్టిపడేసే సూపర్ రైటర్ అవార్డు కోసం ఆకర్షణీయమైన సిరీస్‌ని ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ సృజనాత్మకతను పెంచుకోండి: ట్రెండింగ్ ప్రాంప్ట్‌ల యొక్క మా క్యూరేటెడ్ జాబితా నుండి ప్రేరణ పొందండి మరియు మీ తదుపరి అతిపెద్ద సిరీస్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేయబడిన ప్లాట్లు! ట్రెండింగ్ థీమ్‌లో సిరీస్ రాయడం ద్వారా నెలవారీ రాయల్టీలను పొందండి! ప్లాట్లను విస్తరించడానికి మీ సృజనాత్మకతను ఉపయోగించండి. CEO రొమాన్స్ / హిడెన్ బిలియనీర్ అనికా, దృఢ సంకల్పం గల కళాకారిణి. ఆమె కుటుంబ ప్రత్యర్థి సంస్థ యొక్క CEO వీర్‌తో అనుకోని పరిస్థితుల కారణంగా వివాహం చేసుకుంది. అనికాసంగీత ప్రతిభావంతుడైన సంగీతకారుడు రోహన్ తో రహస్యంగా ప్రేమలో ఉంటుంది. తన ప్రేమ కోసం పోరాడుతున్న అనికా పెళ్లి అనే జైలులో ఉండగలదా? అనికా, వీర్ ప్రేమ సఫలం అవుతుందా? వ్యాపారం మరియు ప్రేమలో వీర్ దేన్ని ఎంపిక చేసుకుంటాడు. తన వ్యాపారంలో జరిగే కుంభకోణం నుండి బయట పడగలడా? బిలియనీర్ రోహన్ తన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో ట్రైనీ చెఫ్‌గా రహస్యంగా చేరుతాడు. అక్కడ, ప్రతిభావంతురాలైన ప్రధాన చెఫ్, మాయను కలుస్తాడు. రోహన్.. మాయ యొక్క అభిరుచి మరియు అంకితభావానికి పడిపోతాడు, కానీ అతను తన రహస్య పాత్రను కొనసాగించగలడా? తను ప్రేమించిన వ్యక్తి గురించి నిజం తెలుసుకున్న మాయ ఎలా స్పందిస్తుంది? ప్లేబాయ్ గా పేరుగాంచిన బిలియనీర్ అర్జున్, కళాకారిణి సియాకు ఆకర్షితుడయ్యాడు. ఆమె మనసును గెలుచుకోవడానికి, అతను తన నిజమైన గుర్తింపును దాచిపెట్టి, విద్యార్థిగా పోజులిచ్చాడు. కానీ వారి ప్రేమ అర్జున్ కుటుంబం యొక్క అసమ్మతి మరియు అతని గతం నుండి ఒక చీకటి రహస్యం నుండి బయటపడగలదా? బిలియనీర్ ఆదిత్య తన బెస్ట్ ఫ్రెండ్ సోదరి రియాను రహస్యంగా ప్రేమిస్తాడు. రియా సోదరుడు ఆర్మీకి బయలుదేరినప్పుడు, అతను ఆమె బాధ్యతను ఆదిత్యకు అప్పగిస్తాడు. ఆదిత్య రియాను రక్షిస్తాడు కానీ అతని భావాలను దాచిపెడతాడు. వారి సంబంధాన్ని ఇష్టపడని ఆదిత్య బంధువు.. అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి వారిని చంపడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? బాగా కష్టపడే కళాకారుడు రఘువీర్. తన అత్తమామలు వారి కుమార్తెకు, రఘువీర్ సరిపోడని భావిస్తున్నా, రఘువీర్ బిలియనీర్ అని వారి దగ్గర దాచిపెడతాడు. మిలీ కుటుంబంలో రఘువీర్ ని అనుమానిస్తున్నా నిజం చెప్పకుండా మిలీ ప్రేమను త్యాగం చేస్తాడా? ఒప్పందం / బలవంతపు వివాహం శ్వేత తన యజమాని రాజీబ్ను ద్వేషిస్తుంది కానీ అనారోగ్యంతో ఉన్న తన తల్లికి డబ్బు అవసరం. రాజిబ్ తాత.. అతను మరణించక ముందే పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు, రాజీబ్ శ్వేతకు ఒక ప్రతిపాదన చేస్తాడు: అతనికి నకిలీ భార్యగా ఒప్పందం. వారి బలవంతపు ఆప్యాయత నిజమైన ప్రేమగా వికసిస్తుందా, లేదా వారి నిరంతర గొడవలు అన్నింటినీ చీల్చివేస్తాయా? తన బాస్ అక్షయ్‌తో రహస్యంగా ప్రేమలో ఉన్న రిద్ధి.. అతని సెక్రటరీగా రాణిస్తూ తన భావాలను దాచిపెడుతుంది. అక్షయ్ కుటుంబం నిశ్చితార్థానికి ఒత్తిడి చేసినప్పుడు, అతను ఒక షాకింగ్ ఆఫర్‌తో రిద్ధిని ఆశ్రయిస్తాడు - పరిస్థితి నుండి తప్పించుకోవడానికి కాంట్రాక్ట్ వివాహం. రిద్ధి తన ప్రేమను కాపాడుకోగలుగుతుందా మరియు తన ఉద్యోగాన్ని కొనసాగించగలదా లేదా అక్షయ్ యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఆమె హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుందా? CEO కియారా, తన కుటుంబ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఆర్యన్‌తో ఒప్పంద వివాహం చేసుకోవలసి వస్తుంది. ఆ విషయాలు ఆర్యన్ కి తెలుసు. కియారా వ్యాపారాన్ని కాపాడుకోవడానికి మొగ్గు చూపుతుందా? లేదంటే, ఆర్యన్ ప్రేమను జయిస్తుందా? వ్యాపారం, ప్రేమ అనే యుద్ద భూమిలో కియారా ప్రయాణం ఎటువైపు? బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడానికి ఆస్తా ముంబై చేరుకొని ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.అవకాశం కోసం నిర్మాత వీర్ తో ఒప్పంద వివాహానికి అంగీకరిస్తుంది. వీర్ కుటుంబం ఆస్తా ను నటన నుండి దూరం అవ్వమంటుంది. ఒప్పంద పెళ్లి, హీరోయిన్ అవ్వాలనే తన కలను కూలిపోయేలా చేస్తుందా? ఆస్తా కల వీర్ కుటుంబం యొక్క ప్రేమకు లొంగుతుందా? ఒప్పందపు పెళ్లి ఎటువైపుకు దారి తీస్తుంది? నృత్యకారిణి సాంచి తన సొంత అకాడమీని ప్రారంభించాలని కలలు కంటుంది. ఆమె కుటుంబ వ్యాపారం నాశనమైనప్పుడు, ఆమె వ్యాపారవేత్త కబీర్‌తో ఒప్పంద వివాహానికి అంగీకరిస్తుంది. ఒప్పందం వల్ల సాంచికి అకాడమీ నిధులు అందుతాయి మరియు కబీర్ తన కుటుంబం యొక్క పూర్వీకుల బంగ్లా వారసత్వంగా పొందుతాడు - సాంచి ఒక సంవత్సరం పాటు ఉండాలనే నిబంధన వల్ల వారి బలవంతపు సహజీవనం ఉద్వేగభరితమైన ప్రేమకథగా మారగలదా? ఈ చిక్కుల నేపధ్యంలో సాంచి అకాడమీ ని కొనసాగించగలదా? సరోగసీ / విడాకులు / రెండవ సారి ప్రేమ ఒక చిన్న పట్టణానికి చెందిన వెడ్డింగ్ ప్లానర్ అయిన రియా, బిలియనీర్ టెక్ సీఈఓ వీర్ యొక్క విలాసవంతమైన వివాహాన్ని నిర్వహించడానికి నియమించబడింది. గతంలో వారు ప్రేమించుకొని ఉంటారు. వారు కలిసినప్పుడు, పాత భావాలు మళ్లీ తెరపైకి వస్తాయి. రియా తన సమస్యలను అధిగమించి, కుటుంబ ఒత్తిడి మరియు డిమాండ్‌తో కూడిన వ్యాపారాన్ని గారడీ చేస్తున్న వీర్‌తో రెండవ అవకాశాన్ని స్వీకరించగలదా? వారి గత తప్పిదాలు వారి ప్రస్తుత సంబంధాన్ని కప్పివేస్తాయా? సియా, అంజని యొక్క చిన్ననాటి స్నేహితురాలు. అంజలి మరియు తన భర్త క్రిష్‌కి సర్రోగేట్‌గా ఉండటానికి సియా అంగీకరిస్తుంది. అంజలి బిడ్డను, సియా తన కడుపులో మోస్తున్నప్పుడు, పెద్ద వ్యాపారవేత్త అయిన క్రిష్‌తో ఊహించని విధంగా ప్రేమలో పడుతుంది. అంజలి పట్ల ఆమెకున్న విధేయత మరియు క్రిష్‌పై ఆమె పెరుగుతున్న భావాల మధ్య నలిగిపోతున్న సియా, తన ప్రేమను బయటపెడుతుందా? ప్రియా మరియు సమీర్ కుటుంబం బలవంతంగా వారికి వివాహం చేసి ఉంటారు. కానీ వారికి ఆ వివాహం ఇష్టం ఉండదు. అనుకోకుండా ప్రియ గర్భవతి అయినప్పుడు,తల్లిదండ్రులుగా మారే క్రమంలో వారు కొన్ని సవాళ్లను ఎదుర్కుంటారు. ఈ క్రమంలో సమీర్ కి ప్రియ పైన ప్రేమ పుడుతుందా? ప్రియ ఆ ప్రేమను అంగీకరిస్తుందా? లేదా ఇంకా ఏదైనా మలుపు తిరుగుతుందా? తన కుటుంబం యొక్క పేదరికం కారణంగా గర్భవతిగా ఉన్నప్పుడు తన ధనవంతుల అత్తమామల ఇంటి నుండి తరిమివేయబడిన తరువాత, మాయ ఒంటరిగా తన జీవితాన్ని పునర్నిర్మించుకుంది మరియు లక్షాధికారి అవుతుంది. ఆమె మోసం చేసిందని తప్పుడు సమాచారాన్ని తన భర్త అక్షయ్ నమ్మి మాయను దూరం చేసుకుంటాడు. నిజం తెలుసుకున్న తర్వాత అక్షయ్ మాయ దగ్గరికి వెళ్తాడు. మాయ అక్షయ్ ని అంగీకరిస్తుందా? విడాకులు తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత, స్వేచ్ఛాయుతమైన ఫోటోగ్రాఫర్ అర్నవ్ తన మాజీ భార్య, ఇప్పుడు విజయవంతమైన వైద్యురాలు అయిన జారాను కలుసుకుంటాడు. ఆమె ఒంటరి తల్లి అని మరియు పిల్లల బయోలాజికల్ తండ్రి అతనే అని తెలుసుకుని అతను షాక్ అవుతాడు. జారాకి పుట్టిన పిల్లలు తన పిల్లలే అని అర్నవ్ఆర్నావ్ నమ్ముతాడా? - ఫాంటసీ హారర్ రొమాన్స్ - 1. మాయ అనే యువతి తన కుటుంబానికి సంబంధించిన ఒక రహస్యాన్ని తెలుసుకుంటుంది. వారి కుటుంబం ధనవంతులుగా కావడానికి వారు ఒక మనిషిని బలి ఇస్తూ క్షుద్ర పూజలు చేస్తుంటారు. మాయ ఆర్యన్ ని ప్రేమిస్తూ ఉంటుంది. వారి కుటుంబం ఆర్యని బలి ఇవ్వడానికి మాయను ఒప్పిస్తారు. మాయ ఆర్యను చంపుతుందా? లేదా ఆర్యన్ మీద ప్రేమ తనను చంపకుండా ఆపుతుందా? ప్రేమ మరియు కుటుంబంలో మాయ దేనిని ఎంచుకుంటుంది? 2. హిస్టరీ స్టూడెంట్ అయిన శిఖా ఓ మ్యూజియంలో ఓ పురాతన కవచాన్ని కనుగొంటుంది. ఆమె కవచాన్ని తాకుతున్నప్పుడు, ఆమె గత యుగంలోకి వెళ్తుంది, కవచం లోపల చిక్కుకున్న వీర్ అనే వీర సైనికుడిని కలుస్తుంది. అతడిని ప్రేమిస్తుంది. ఆమె వీర్ ని కవచం ఉంది బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక శక్తి వీర్ ని బయటికి రాకుండా ఆపుతుంది. వారి ప్రేమ సఫలం అవుతుందా ద్రుష్ట శక్తి వారిని బ్రతకనిస్తుందా? 3. నిషా కు ఆత్మలను చూడడం, వాటితో మాట్లాడే సామర్థ్యం ఉంది. రాఘవ్ ఆత్మ ఆమె రాఘవ్ అనే అంతుచిక్కని అపరిచితుడిని కలుస్తుంది. నిషా యొక్క కళ వారి ఆత్మలను ఏకతాటిపైకి తెస్తుంది, కానీ వారి కనెక్షన్ నిషా శక్తిని వినియోగించడానికి ప్రయత్నించే దుర్మార్గమైన అస్తిత్వాన్ని బహిర్గతం చేస్తుంది. నిషా, రాఘవ్ కలిసి అస్థిత్వ రహస్యాలను ఛేదించి అశాంతితో ఉన్న ఆత్మలకు శాంతిని కనుగొనగలరా, లేక చీకటిపై పోరాటంలో వారి ప్రేమ త్యాగం అవుతుందా? 4. అంజలి అనే నృత్యకారిణి ఒక పురాతన దేవాలయంలో నృత్య ప్రదర్శన ఇస్తుంది, ఆమెకు తెలియకుండానే శక్తివంతమైన యక్షుడిని (ఖగోళ జీవి) మేల్కొలుపుతుంది. తీరని ఆకలితో అలమటించిన యక్షుడు అంజలి ప్రాణాన్ని కోరుకుంటాడు. కానీ అతను ఆమెను చంపుతున్నప్పుడు ఒక శక్తి ఆపుతుంది. అంజలి శాపాన్ని విడనాడి వారి ప్రేమను కాపాడటానికి ఒక మార్గాన్ని కనుగొనగలదా, లేదా యక్షుడి ఆకలికి మరొక బాధితురాలు అవుతుందా? 5. కియారా ఒక నాగిన్( పాము ఆత్మ), తనకు అన్యాయం చేసిన రాజకుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. అర్జున్ అనే యువరాజు కియారా ప్రతీకారం నుండి రాజ కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. కియర తన గతాన్ని అర్జున్ కి చెప్పే క్రమంలో , వారు ప్రేమలో పడతారు. నాగినులకు, మానవులకు మధ్య ఉన్న అనాదిగా ఉన్న వైరాన్ని వారి ప్రేమ అధిగమించగలదా, లేదా పురాతన శాపాలతో వారి బంధం నాశనమవుతుందా? శక్తివంతమైన సాధనాలతో మీ కథను సిద్దం చేయండి :Gemini వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. ఈ టూల్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ ఉంది: 1. స్టొరీ ఐడియా: జెమినీ టూల్ లో మీరు కథ రాస్తున్న అంశం, జోనర్ లను తెలుగు లేదా ఇంగ్లీష్ లో ఇవ్వండి. అది సృజనాత్మకమైన ప్లాట్, ట్విస్ట్ మరియు ఊహించని మలుపులు, సబ్ ప్లాట్ లను మీకు సూచిస్తుంది. ఉదాహరణ: "నేను ఒక బిలియనీర్ వారసురాలి గురించి రాస్తున్నాను, ఆమె తన అందమైన అంగరక్షకుడిని ప్రేమిస్తుంది అని టూల్ లో ఇస్తే, వారు తమ ప్రేమలో ఎదుర్కునే సవాళ్లను, కుటుంబం నుండి ఎదుర్కునే వ్యతిరేకతను ఆసక్తికరమైన త్విస్త్లను టూల్ మనకు అందిస్తుంది. 2. పాత్రలను రూపొందించడం: టూల్ కి మీ కథలోని పాత్రల స్వభావాల గురించి, గతం గురించి వివరించండి. పాత్రల గురించి వివరంగా, ప్రేరణ, పాత్రల గురించి పూర్తి సమాచారం టూల్ మీకు ఇస్తుంది. ఉదాహరణ:నేనుబలమైన మహిళా కథానాయకురాలితో ఫాంటసీ సిరీస్ రాస్తున్నాను. ఆమె వ్యక్తిత్వాన్ని, ప్రేరణలను నేను ఎలా పెంపొందించగలను? మీరు కథాంశం లేదా పాత్రల వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు అడగవచ్చు. జెమినీ టూల్ మీ ఇన్ పుట్ ను విశ్లేషిస్తారు మరియు అన్వేషించడానికి సలహాలు, ఆలోచనలు సూచనలను అందిస్తారు. వివిధ ఏఐ టూల్స్ ను మీరే పరిశోధించవచ్చు. గుర్తుంచుకోండి, మీ సృజనాత్మకతను సహాయక టూల్స్ ఉపయోగించుకొని కథను మరింత బాగా రాయవచ్చు. ఈ క్రింది అంశాలను ఉపయోగించుకొని సిరీస్ ను మరింత బాగా రాయండి. ప్లాట్లు పాత్రలు: ప్లాట్ ఆలోచనను అతిపెద్ద సిరీస్‌గా ఎలా అభివృద్ధి చేయాలి? పాత్రలు మరియు ఉప ప్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలి? పాపులర్ ప్లాట్లు, క్లిఫాంగర్లు మరియు హుక్స్ ఉపయోగించడం! నిర్దిష్ట శైలి: ప్రేమ వర్గంలో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? ఫ్యామిలీ డ్రామా, సోషల్ మరియు మహిళా థీమ్స్‌లో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? మిస్టరీ, ఫాంటసీ మరియు హారర్ థీమ్‌లతో ఆసక్తికరమైన సిరీస్‌ను ఎలా రాయాలి? ఆసక్తికరమైన థ్రిల్లర్ సిరీస్‌ను ఎలా రాయాలి? రాసే పద్ధతులు: ఎక్కువ డబ్బు సంపాదించే సిరీస్ రాయడం ఎలా? పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెంట్లు మరియు వాటి సీక్వెన్స్ మరియు ప్లాట్ హోల్స్‌ను అర్థం చేసుకోవడం సిరీస్ భాగాలు మరియు సీన్స్ ఎలా రాయాలి? డైలాగ్ రైటింగ్ టెక్నిక్స్ మరియు మొదటి చాప్టర్ స్ట్రాటజీస్ హుక్స్ మరియు ప్లాట్ ట్విస్ట్‌లు: వాటిని ఎఫెక్టివ్‌గా ఉపయోగించడం మరియు చిరస్మరణీయమైన సిరీస్ ముగింపుని ఎలా రూపొందించాలి? విభిన్న భావోద్వేగాలను ఎలా రాయాలి? ప్రణాళిక మరియు సవాళ్లను అధిగమించడం: రైటింగ్ షెడ్యూల్ ఎలా తయారు చేయాలి? రాసేటప్పుడు సాధారణ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు (నిరోధాలు/ఒత్తిడి/సమయం) ఎక్కువ భాగాల సిరీస్ రాయడానికి సవాళ్లను అధిగమించడం! ప్రతిలిపిలో అతిపెద్ద సిరీస్ యొక్క ప్రయోజనాలు: ప్రతిలిపి అతిపెద్ద సిరీస్‌లను ఎందుకు ప్రోత్సహిస్తుంది? సంపాదన పెంచుకోవడం! జనాదరణ పొందిన సిరీస్ నిర్మాణాన్ని విశ్లేషించడం పాఠకులను ఆకర్షించడం (ప్రమోషన్) రికమెండేషన్ సిస్టం అర్థం చేసుకోవడం ప్రీమియం సిరీస్‌తో నెలవారీ రాయల్టీలను పొందడం సీజన్స్ రాయడం బోనస్ చాప్టర్ ఎలా రాయాలి? అతిపెద్ద సిరీస్ విజయం యొక్క ప్రయోజనాలు ఫెలోషిప్ ప్రోగ్రాం 1 ఫెలోషిప్ ప్రోగ్రాం 2 ప్రతిలిపి క్రియేటర్స్ ప్రోగ్రాం 1 ప్రతిలిపి క్రియేటర్స్ ప్రోగ్రాం2 ఈ రోజే మీ సిరీస్ రాయడానికి ప్లాన్ చేసుకోండి. ఈ మొత్తం ప్లాన్ కు 4-5 రోజులు పడుతుంది. మీరు ప్రతిలిపి సూపర్ రైటర్ అవార్డ్స్ పోటీకి సిరీస్ ప్రచురించడం ప్రారంభించినప్పుడు, ఈ ప్లాన్ ప్రతి సిరీస్ భాగాన్ని ఎటువంటి అడ్డంకులు, అంతరాయం లేకుండా రాయడానికి ఎంతగానో సహాయపడుతుంది. భారతదేశపు అతిపెద్ద సిరీస్ పోటీ సూపర్ రైటర్ అవార్డ్స్ 8 లో పాల్గొనడానికి ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయండి. https://telugu.pratilipi.com/event/f9i7gsf9ky అల్ ది బెస్ట్! ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- సూపర్ రైటర్ అవార్డ్స్ | సీజన్ 9 | FAQ బ్లాగ్09 మే 20241. ఈ పోటీలో ఎవరెవరు పాల్గొనవచ్చు? ప్రతిలిపి రచయితలందరూ గోల్డెన్ బ్యాడ్జ్ ఉన్నా, లేకపోయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు. 2. ముందుమాట, ప్రోమో, ట్రైలర్, ఇతర గమనికలను ఒక సిరీస్ భాగంగా నేను ఎందుకు ప్రచురించకూడదు? ముందుమాట, ప్రోమో, ట్రైలర్ ఎందుకు ప్రచురించకూడదో తెలుసుకుందాం: రీడర్ ఎంగేజ్మెంట్: పాఠకులు మొదటి భాగంలో ప్రధాన కథను చదవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరా విషయాలను సిరీస్ భాగంగా ప్రచురించడం వలన, సిరీస్ పైన తమకున్న ఆసక్తిని కోల్పోతారు. గమనిక: మీరు మొదటి భాగంలో ముందుమాట, ప్రోమో, ట్రైలర్ రాయాలనుకుంటే కేవలం 4-5 లైన్లలో రాసి, వెంటనే ప్రధాన కథను ప్రారంభించి పాఠకులను ఆకట్టుకోవచ్చు. 3. పోటీలో అర్హత పొందడానికి నా సిరీస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రోగ్రాంలో ఎలా పెట్టాలి? గోల్డెన్ బ్యాడ్జ్ రచయితగా మీ కొత్త సిరీస్ యొక్క మొదటి 15 భాగాలను పాఠకులు ఉచితంగా చదవగలుగుతారు. మీరు 16వ భాగాన్ని ప్రచురించిన తర్వాత, మీ సిరీస్ ప్రతిలిపి ప్రీమియం సిరీస్ గా మారుతుంది, ఈ సిరీస్ నుండి మీరు ప్రతీనెల డబ్బు సంపాదించవచ్చు. 4. నాకు ప్రస్తుతం గోల్డెన్ బ్యాడ్జ్ లేదు, మరి నేనేం చేయాలి? మీకు గోల్డెన్ బ్యాడ్జ్ లేకపోయినా, మీ సిరీస్ సాధారణంగానే పోటీకి ప్రచురించవచ్చు. పోటీ మధ్యలో మీకు గోల్డెన్ బ్యాడ్జ్ వస్తే, మీ సిరీస్ ప్రీమియం సిరీస్ గా మారుతుంది. అంతే కాకుండా, గోల్డెన్ బ్యాడ్జ్ వచ్చిన తర్వాత మీ 16+ భాగాల సిరీస్ ని ప్రీమియం సిరీస్ గా మీరే మార్చుకోవచ్చు. ప్రతిలిపి యాప్ ఓపెన్ చేసి, రాయండి పైన క్లిక్ చేయండి. మీ సిరీస్ సెలెక్ట్ చేసుకోండి. ఇతర సమాచారాన్ని సవరించండి అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీ సిరీస్ సబ్స్క్రిప్షన్ లో ఉండాలా అనే ఆప్షన్ కనిపిస్తుంది. అవును పైన క్లిక్ చేయండి. 24 గంటల్లో మీ సిరీస్ ప్రీమియం సిరీస్ గా మారుతుంది. 5. ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ ఎలా పొందాలి? ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయిత కావడానికి, ఈ క్రింది నియమాలను పాటించాలి. మీ ప్రొఫైల్ కి కనీసం 200 మంది అనుచరులు ఉండాలి. గత ముప్పై రోజులలో కనీసం 5 రచనలను మీ ప్రొఫైల్ లో ప్రచురించి ఉండాలి. మీ ప్రతిలిపి ప్రొఫైల్ కి గోల్డెన్ బ్యాడ్జ్‌ని పొందిన తర్వాత, మీ సిరీస్ ని సబ్‌స్క్రిప్షన్‌లో ఉంచుకోగలరు. తద్వారా మీరు సంపాదించడం ప్రారంభించవచ్చు. లక్షలాది రూపాయల నగదు బహుమతి మరియు ఇతర ప్రత్యేక బహుమతులను గెలుచుకోవచ్చు. 6. నా సిరీస్ పోటీలో ఉన్నదో, లేదో నాకెలా తెలుస్తుంది? పోటీ కోసం మీ సిరీస్ పరిగణించబడిందో, లేదో నిర్ధారించుకోవడం ఎలాగో చూద్దాం: పోటీ యొక్క గడువు లోపు మీ సిరీస్ ప్రచురించండి:కనీసం 80 భాగాలతో పోటీ ప్రారంభ మరియు ముగింపు తేదీల మధ్య మీ సిరీస్‌ను ప్రారంభించి, పూర్తి చేయాలి. ప్రతి భాగంలో కనీసం 1000 పదాలు ఉండాలి. (గరిష్ట పద పరిమితి లేదా భాగాల పరిమితి లేదు) పోటీ యొక్క వర్గాన్ని ఎంచుకోండి: మీ సిరీస్ భాగాలను ప్రచురించేటప్పుడు, "సూపర్ రైటర్ అవార్డ్స్ - 8" వర్గాన్ని ఎంపిక చేసుకోండి. అలా చేసినప్పుడే మీ సిరీస్ పోటీలో ఉందని అర్థం. పోటీ నియమాలను అనుసరించండి: పోటీ యొక్క అన్ని నియమ నిబంధనలకు మీ సిరీస్ లోబడి ఉందని నిర్ధారించుకోండి. 7. ఈ పోటీకి సంబంధించిన ఫలితాల ప్రక్రియ ఎలా నిర్వహించబడుతుంది? పోటీ గడువు ముగిసిన తర్వాత, పోటీ వర్గంతో ప్రచురించబడిన అన్ని సిరీస్‌లను మా టీం గుర్తిస్తుంది. పోటీ నియమాలు మరియు మార్గదర్శకాలను అనుసరించి రాసిన సిరీస్ లను మాత్రమే న్యాయనిర్ణేతలకు పంపబడతాయి. మా న్యాయనిర్ణేతల బృందం అన్ని సిరీస్‌లను సమీక్షిస్తుంది, కథా ప్లాట్లు, మొదటి నుండి చివరి వరకు కథ యొక్క తీవ్రత, పాత్రల అభివృద్ధి, వివరణ, డైలాగ్ రైటింగ్, ప్లాట్ ట్విస్ట్‌లు మొదలైన వాటి ఆధారంగా ఫలితాలు ప్రకటించబడతాయి. 8.100-భాగాల ఛాంపియన్ల కోసం మొదటి 20 సిరీస్‌ను ఎలా ఎంపిక చేస్తారు? పోటీ నియమాలు మార్గదర్శకాలను పాటిస్తూ కనీసం 100 భాగాలతో పూర్తైన అన్ని సిరీస్ లు చాంపియన్ సిరీస్ గా అర్హత సాధిస్తాయి. వచ్చిన సిరీస్ ల నుండి, రీడర్ ఎంగేజ్మెంట్ స్కోర్, రీడ్ కౌంట్ లాంటి అనేక అంశాలను పరిగణించి మొదటి 20 సిరీసులు ఎంపిక చేయబడతాయి. 9.నేను ఈ పోటీ కోసం నా ప్రస్తుత సిరీస్ యొక్క తదుపరి సీజన్‌ను రాయవచ్చా? అవును, మీరు రాయవచ్చు కానీ న్యాయమైన ఫలితాల కోసం పూర్తి కథాంశంతో కూడిన ఒకే సిరీస్‌ని రాయమని సూచిస్తాము. మీ కొత్త సిరీస్ మునుపటి సిరీస్ ప్లాట్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటే, న్యాయనిర్ణేతలు చదవడానికి కష్టపడవచ్చు మరియు మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. 10. నేను ఒకే సిరీస్‌ని రెండు వేర్వేరు పోటీలకు సబ్మిట్ చేయవచ్చా? ఒక సిరీస్, ఒక పోటీకి మాత్రమే సబ్మిట్ చేయాలి. కాబట్టి ఒకే సిరీస్‌ని అనేక పోటీలకు సబ్మిట్ చేయడం అనుమతించబడదు. 11. నేను పోటీ ఫలితాలను ఎక్కడ చూడగలను? ఈ నిర్దిష్ట పోటీ ఫలితాలు బ్లాగ్ విభాగంలో ముందుగా ప్రకటించిన తేదీలో ప్రతిలిపి టీం ద్వారా ప్రచురించబడతాయి. ప్రతిలిపి యాప్‌ను తెరిచి, "పెన్" గుర్తును నొక్కండి. పేజీ దిగువకు స్క్రోల్ చేసి, "బ్లాగ్" విభాగంపై క్లిక్ చేయండి. సూపర్ రైటర్ గా మారడానికి సహాయం కావాలా? =సిరీస్ ఎలా ప్రచురించాలి, పోటీ యొక్క వర్గం ఎలా జోడించాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి:ఇక్కడ క్లిక్ చేయండి. = ప్రతిలిపిలో ట్రెండింగ్ లో ప్లాట్లు రైటింగ్ టిప్స్: ఇక్కడ క్లిక్ చేయండి. పోటికి సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి [email protected]కి మెయిల్ చేయండి. మా టీం 24 గంటలలోగా మీ సమస్యను పరిశీలించి, రిప్లై ఇస్తారు. ప్రతిలిపి వేలాదిమంది రచయితలతో రోజూ పనిచేస్తూ వారి కలలను సాకారం చేస్తోంది. మేము, మీ కోసం ఒక అద్భుతమైన ప్లాట్‌ఫారమ్‌ను అందించాము. మీ సాహిత్య ప్రతిభను ప్రతిలిపి ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి రచయితగా ఎదగవచ్చు మరియు మీ రచనల నుండి ప్రతీనెల సంపాదించుకోవచ్చు. పోటీలో పాల్గొని, బెస్ట్ సెల్లర్ రచయితగా నిలవాలనే మీ కలను నిజం చేసుకోండి. ఆల్ ది బెస్ట్! ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- సూపర్ రైటర్ అవార్డ్స్ - 6 పోటిలో టాలెంటెడ్ ఎమర్జింగ్ రైటర్స్ కి అభినందనలు!09 ఏప్రిల్ 2024గౌరవనీయులైన రచయిత గారికి, ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ - 6' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము. తమ ప్రతిలిపి ప్రొఫైల్ లో మొట్ట మొదటిసారిగా 60 భాగాల సిరీస్ ప్రచురించి పూర్తి చేసిన రచయితలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 60 భాగాల సిరీస్ మొట్టమొదటిసారి రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే, ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు. నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య పోటీలో 60 భాగాల సిరీస్ లను ప్రచురించారు. కొంత మంది మధ్యలో ఆపివేయడం కూడా మేము గమనించాము. వచ్చే పోటిలో పట్టుదలతో రాసి మీరు కూడా ఎ జాబితాలో చేరుతారని ఆశిస్తున్నాము. ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇచ్చిన మాట ప్రకారం రచయితల నుండి ఇంటర్వ్యూ తీసుకొని త్వరలో వాటిని ప్రతిలిపి అధికారిక ప్రొఫైల్ లో ప్రచురిస్తాము. తమ ప్రతిలిపి ప్రొఫైల్ లో మొట్ట మొదటిసారిగా 60 భాగాల సిరీస్ ప్రచురించి పూర్తి చేసిన రచయితల వివరాలు: తోడు కోసం - వైబోయిన సత్యనారాయణ "లోవదాస్" పూర్ణిమ - Gagana సుహా గతజన్మ రహస్యం - చెరుకుపల్లి పద్మామూర్తి నచ్చావులే - వెంకట దుర్గా ప్రసాద్ చెల్లాచెదురైన జీవితాలు - మధుబాల రహస్య స్నేహితుడు - బండారు కిషోర్ కుమార్ చెప్పవేచిరుగాలి - అంజలి గాయత్రి "మైత్రేయగీతిక" తెలుసా నీకైనా - హారిక మైథిలి మనసు మాట వినదు - షకీర షేక్ ప్రతిలిపి దృష్టిలో మీరంతా ఎమర్జింగ్ రైటర్స్! ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము. ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 7' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4 తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://telugu.pratilipi.com/event/flzcbzna2d మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము. ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి
- సూపర్ రైటర్ అవార్డ్స్ - 6 పోటీలో 80+భాగాల సిరీస్ రాసిన రచయితలకు అభినందనలు!29 మార్చి 2024గౌరవనీయులైన రచయిత గారికి, ఒక ముఖ్యమైన వార్తతో మీ ముందుకు వచ్చాము. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సూపర్ రైటర్ అవార్డ్స్ - 6' ఫలితాలను కొద్ది రోజుల క్రితమే ప్రకటించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలో పాల్గొనే రచయితలందరికీ ఒక ఛాలెంజ్ ఇచ్చాము.80 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ రాసే ప్రతి రచయితకు ప్రతిలిపి నుండి గ్యారంటీ బహుమతులు ప్రకటించాము. 80 భాగాల సిరీస్ రాయడానికి ఎక్కువ సమయం, సహనం, నైపుణ్యాలు, క్రమశిక్షణ మరియు ప్రతిభ అవసరం కాబట్టి ఇది చాలా కఠినమైన ఛాలెంజ్. రాయడం మీద అమితమైన ప్రేమ లేకపోతే, ఛాలెంజ్ ని పూర్తి చేయడం అంత సులభం కాదు. నిజం చెప్పాలంటే, రచయితల నుండి వచ్చిన స్పందనను చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఎంతో మంది రచయితలు ఈ ఛాలెంజ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సాహిత్య పోటీలో 100 భాగాల సిరీస్ లను ప్రచురించారు. వాటిలో కొన్ని 150/200/250 లేదా అంతకంటే ఎక్కువ భాగాలతో సిరీస్ లు ఉన్నాయి. ప్రతిలిపి రచయితల ప్రతిభ అమోఘం. ప్రతిలిపిలో ప్రతిభ గల రచయితలు ఉన్నందుకు సంతోషిస్తున్నాము. ఇలాంటి అంకితభావం, అభిరుచి, కృషితో గొప్ప భవిష్యత్తును సృష్టించగలమనే నమ్మకం మాకుంది. పోటీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ రచయితకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ రచనా అభిరుచి మాకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఇతర రచయితలకు కూడా స్ఫూర్తినిస్తుంది మరియు ప్రేరేపిస్తుందని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. అందుకే మీ ప్రత్యేక విజయాన్ని మొత్తం ప్రతిలిపి కుటుంబంతో పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇచ్చిన మాట ప్రకారం కొరియర్ ద్వారా మీ అందరికీ స్పెషల్ బహుమతి పంపిస్తాం. దయచేసి కొన్ని రోజులు వేచి ఉండండి, దీనికి సంబంధించి మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది. సూపర్ రైటర్ అవార్డ్స్-6 పోటీకి ప్రచురించిన అతిపెద్ద తెలుగు సిరీస్: రాజు గారి అమ్మాయి : Mr. పర్ఫెక్ట్(మిస్) : 180 భాగాలు 80 లేదా అంతకంటే ఎక్కువ భాగాల సిరీస్ ప్రచురించిన రచయితల వివరాలు- సీతారామం - స్వాతి సఖియా - ప్రియ శ్రీనివాస్ పెద్దక్క - వాసుకి మనసు పలికే మాట ప్రేమ - భవాని మార్ని నా తోడుంటావా - అవని శ్రీ ఇట్లు సీతా మహాలక్ష్మి - స్నేహ శ్రావణ మేఘాలు - విజయ గండికోట తొలిప్రేమ - సుజాత MVS ఇష్ట సఖుడా - సిరి కృష్ణ హీరోయిన్ - గౌరి పొన్నాడ మైనా - సాయి ప్రవల్లిక మనసు పడ్డాను.. కానీ - చాణక్య రెడ్డి వేటాడే క్రోధక్షి - వెంకట హరిత సమ్మతి - సాయి ప్రవల్లిక నా ప్రాణం లో ప్రాణంగా - రమ్య విక్రమ్ - తేజోరామ్ ఇది..(తప్పు).. కాదంటారా - మీనా కుమారి విక్రమాదిత్య - ఆలూరి గంగ వల్లకాడు - వెంకటేష్ బాబు విన్నకోట విజయసేన విజయం - హేమంత అగస్త్య ప్రగడ నా ప్రాణం నీ నేస్తం - రాజి వసుధైక అపార్ట్మెంట్స్ - దుర్గా భవాని జామి ఫైర్ బ్రాండ్ - రాజేష్ తొగర్ల ముద్దుగుమ్మా - వెన్నెల ఈ రేయి తీయనిది - నర్మద ఏశాల సఖా - సిరి అర్జున్ వంశధార - యస్ యస్ సుజాతమ్మ చిత్తూరు ఏనుగు - చిట్టత్తూరు మునిగోపాల్ ఓ స్త్రీ రేపు రా - చైతన్య భారతం మారాలి - కుసుమ సాంబశివ ట్రూ లవ్ - జానకి ఉత్తరాన దక్షిణామూర్తి - రాజేష్ తొగర్ల వదలని బంధం - సత్య ఆమె కథ - లహరి రాజశేఖర్ వెన్నెల్లో ఆకాశం - రాధిక ఆండ్ర ఓ సారిలా చూడే చెలి - రాజి షణ్ముఖపురం - కృష్ణ సఖి అరుణ కిరణం - చెరుకుపల్లి జయచంద్ర చెల్లాచెదురైన జీవితాలు - మధుబాల యష్ట - అనురాధ మురుగము బూజుల మరుగేలనే ఓ మనసా - సుష్మ చిట్టినేని మధుమాసపు వెన్నెల - పొందూరు రాంబాబు ప్రతిలిపి దృష్టిలో మీరంతా సూపర్ రైటర్స్! ఈ అభిరుచితోనే రాస్తూ ఉండండి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మేము నమ్ముతున్నాము. ప్రస్తుతం జరుగుతున్న 'సూపర్ రైటర్ అవార్డ్ - 7' పోటీలో మీరంతా పాల్గొని పాఠకులకు ప్రజాదరణ పొందిన, బెస్ట్-సెల్లర్ సిరీస్ లను ఆస్వాదించే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి మీరు ఆగస్టు 4 తేదీలోగా 60 భాగాల సిరీస్ ను ప్రచురించాలి. ప్రత్యేక బహుమతుల గురించి, పోటీలో ఎలా పాల్గొనాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://telugu.pratilipi.com/event/flzcbzna2d మీరు రాయబోయే సిరీస్ చదవడానికి ఎదురుచూస్తూ ఉంటాము. ప్రతిలిపి పోటీల విభాగంసంపూర్ణంగా చూడండి